Ananya Nagalla : వాటికి సర్జరీ చేయించానని ఒప్పుకున్న అనన్య నాగళ్ల.. చేయించి రెండేళ్లు అవుతోందంటూ?

తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరోయిన్ అనన్య నాగళ్ళ( Ananya Nagalla ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మల్లేశం( Mallesham ) అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.

 Ananya Nagalla Talking About Her Lip Filler Surgery-TeluguStop.com

మొదటి సినిమాలోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది.ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో( Vakeel Saab ) ఒక హీరోయిన్ గా నటించి అందరి దృష్టిలో పడింది.

వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది.దీంతో తన అవకాశాల కోసం తానే కష్టపడుతోంది.

ఇక సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Telugu Ananya Nagalla, Ananyanagalla, Tantra, Tollywood-Movie

ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో తగ్గేదేలే అంటుంది అనన్య.ఇక ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తంత్ర.( Tantra ) మార్చి 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ ప్యాంట్ తడిసిపోయేలా భయపెట్టాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనన్య.వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది.

తాజాగా ఈ చిన్నది దావత్ అనే షోలో పాల్గొంది.అందులో తన సర్జరీకి( Surgery ) సంబంధించిన విషయాలను పంచుకుంది.

Telugu Ananya Nagalla, Ananyanagalla, Tantra, Tollywood-Movie

ప్రస్తుత ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ గ్లామర్ ను కాపాడుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు అన్న విషయం తెల్సిందే.మీరెప్పుడైనా అలాంటి సర్జరీ చేయించుకున్నారా ? అన్న ప్రశ్నకు అనన్య నిర్మొహమాటంగా అవును చేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది.నేను లిప్ ఫిల్లర్( Lip Filler ) వేయించాను.అది వేసి రెండేళ్లు అవుతుంది.ఇప్పుడు పోయినట్టుంది అని చెప్పుకొచ్చింది.లిప్ ఫిల్లర్ అంటే .పెదాలు షేప్ వచ్చేలా చేస్తారు.ఇక ఇండస్ట్రీలో ఉండే కొన్ని కష్టాల గురించి కూడా అనన్య మాట్లాడింది.

కార్లు, అసిస్టెంట్లు ఉంటే వేరేవిధంగా చూస్తారని, అవి లేకపోతే పట్టించుకోరని చెప్పింది.సమంత, అలియా భట్ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పిన అనన్య.

హిట్ అందుకున్నాకా అందరూ తనను గుర్తుపట్టి మాట్లాడతారు అనుకున్నాను అని, కానీ ఆ హ్యాపినెస్ బయట కనిపించలేదని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube