Anant Ambani : నాకు పెళ్లి కాదు అనుకునేవాడిని.. అందుకే బరువు పెరిగా.. అనంత్ అంబానీ కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ముకేశ్ అంబానీ వారసులలో ఒకరైన అనంత్ అంబానీ( Anant Ambani ) పేరు తెగ వైరల్ అయింది.అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

 Ananth Ambani Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనంత్ అంబానీ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.బాల్యం నుంచి నాకు ఆస్తమా ఉండేదని ఆస్తమా ఉండటం వల్ల నేను స్టెరాయిడ్లు వాడేవాడినని ఆయన తెలిపారు.

ఆ మందుల వల్ల ఆకలి పెరగడంతో విపరీతంగా తినేవాడినని అనంత్ అంబానీ తెలిపారు.ఫలితంగా 200 కిలోల బరువు పెరిగానని తర్వాత రోజుల్లో బరువు తగ్గేందుకు ఆహారంలో మార్పులు చేసుకున్నానని అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు.

రోజుకు 20 కిలోమీటర్లు నడవడంతో పాటు యోగా, ఇతర వ్యాయామాలు చేసేవాడినని అనంత్ అంబానీ కామెంట్లు చేయడం గమనార్హం.

18 నెలల్లో 100 కేజీలు తగ్గాను కానీ స్టెరాయిడ్ల ( Steroids )వల్ల మళ్లీ బరువు పెరిగానని ఆయన తెలిపారు.నేను, రాధిక( Radhika ) బాల్యం నుంచి ఫ్రెండ్స్ అని వేర్వేరు చోట్ల చదువుకున్నా మా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగిందని అనంత్ అంబానీ అన్నారు.నాకు అసలు పెళ్లి కాదని అనుకునేవాడినని రాధిక నా కలల రాణి అనిపించిందని అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు.

మా ఇంట్లో అందరికీ దైవ భక్తి ఎక్కువని ఆయన తెలిపారు.

మా అన్న ఆకాశ్( Akash ) నాకు రాముడి లాంటి వాడని అక్క ఈశా అమ్మతో సమానమని అనంత్ అంబానీ పేర్కొన్నారు.అక్క, అన్నలకు నేను హనుమంతుడిలాంటి వాడినని అనంత్ అంబానీ వెల్లడించారు.అనంత్ అంబానీ జంతు ప్రేమికుడు కూడా కావడం గమనార్హం.

అనంత్ అంబానీ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోయే యువతి పేరు రాధిక మర్చంట్ కాగా ఈమె ఆస్తి 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube