ఆనంద్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పటి సావిత్రిగారి దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన సమంత వరకు సోషల్ సర్వీస్ లు చేస్తూ నలుగురికి సహాయ చేస్తున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు.

ఎన్నో సినిమాల్లో నటించి దాని ద్వారా వచ్చిన డబ్బును, పేరుని ఇలా సోషల్ సర్వీస్ కి ఉపయోగిస్తూ నలుగురికీ ఉపయోగపడే లా జీవిస్తున్నారు.

అంతేకాదు వాళ్ళని అభిమానించే అభిమానులు కూడా ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.ఈ లిస్టు చాలామందే ఉన్నా మనకు ఎక్కువగా వినిపించే హీరోయిన్స్ పేర్లు బ్లూ క్రాస్ కు చెందిన అమలా గారు, పెట్టాకి చెందిన త్రిష గారు వాళ్లకు ఉన్నంతలో సహాయం చేస్తూ నలుగురికి ఇకపోతే ఈ లిస్ట్ లో ఒకప్పటి బాలనటి భకిత కుడా ఇప్పుడు సేవ కార్యక్రమాలు చేస్తుందట.

అయితే బాలనటి బకిత అంటే ఎక్కువ అందికీ తెలియకపోవొచ్చు కానీ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఆనంద్ సినిమాలో హీరో రాజాని తన ముద్దు ముద్దు మాటలతో ఏడిపిస్తూ ఉండే బాలనటి అంటే మాత్రం అందరికి గుర్తుకువస్తుంది.అంతేకాదు ఆ సినిమాకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా దక్కించుకుంది.

అయితే భకితకి నటన మీద అంతగా ఆసక్తి లేకపోవడంతో "ఆనంద్" సినిమా తర్వాత ఇంకే సినిమాలోనూ నటించలేదు.ప్రెసెంట్ ఈమెకి 25 సంవత్సరాలు.సో, చాలామంది అచ్చం హీరోయిన్ లాగే ఉన్నావ్! మళ్ళీ సినిమాల్లో నటించవచ్చు కదా అని అడిగినా వాళ్లందరికీ నో చెప్పేదట!

Advertisement

అయితే చిన్నప్పటి నుండే నటనలోనూ, చదవులోను ఎంతో చురుగ్గా ఉండే భకిత.ఇప్పుడు ఒక డిఫరెంట్ దారిని ఎంచుకుంది.తన జీవితంలో పాపులారిటీ, డబ్బు వీటన్నింటికన్నా.

సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలి అని అనుకుంది.అందుకే ఇప్పుడు మహిళల హక్కుల కోసం, సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లకు కూడా సమన హక్కులు కల్పించాలని, ఆడవారిపై ఎలాంటి దాడులు గాని అత్యాచారాలు గాని జరక్కుండా సరైన చట్టాలను తీసుకురావాలని పోరాట దిశగా సాగుతుంది.

అయితే ఈ పోరాటం భకిత తన 17 సంవత్సరం నుండే మొదలుపెట్టింది.సో, ఎంతో గ్రేట్ కదా.హీరోయిన్ అవుదాం.లేదా యాక్టర్ అవుదాం.

ఫేమస్ అయి హ్యాపీ గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ఇలా ఏవేవో చేస్తూ సోషల్ మీడియాకి అతుక్కు పోతున్న ఈ కాలం యూత్ కి ఆదర్శంగా నిలుస్తోంది భకిత!.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు