టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ఆనంద్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం బేబీ.ఈ సినిమాకు సాయి రాజేష్ ( Sai Rajesh )దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇందులో వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది వైష్ణవి చైతన్య.
ఇందులో వైష్ణవి డీ గ్లామర్ రోల్ లో నటించింది.ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ కి ఈ సినిమా నుంచి భారీగా స్పందన లభిస్తోంది.ఇందులోని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం సుమా అడ్డా షోకి( Suma Adda ) హాజరయ్యారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లపై పంచులు వేస్తూ ఫుల్ గా నవ్వించింది సుమ.
ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ చైతన్యకు షో లోనే ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశాడు.ఆనంద్, వైష్ణవి ఇద్దరు బొమ్మరిల్లు స్పూఫ్ చేస్తుండగా ఆ సందర్భంగా ఒక సారి తల గుద్దుకుంటే కొమ్ములొస్తాయి కొమ్ములొస్తే.నా మొహం బాగోదని వైష్ణవి అనగానే, ఆనంద్ దగ్గరికి వచ్చి ఆమె తలను ఢీ కొట్టి, చాలా అని అడుగుతాడు.
ఆమె చూసేసరికి ఇంకో సారా అంటూ దగ్గరకు వెళ్లిమళ్లీ తలను ఢీకొని ఐలవ్ యూ అని ప్రపోజ్ చేశాడు.దీంతో వైష్ణవి కూడా మురిసిపోయింది.ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది.