భూమి, ఇళ్ల స్థలాలు లక్షల్లో అమ్ముడు పోవడం గురించి మేము విన్నాం గాని, ఈ గోడ గొడవేమిటని ఆలోచిస్తున్నారు కదూ! నిజమే, మీరు విన్నది అక్షరాలా నిజం.ఓ ప్రబుద్ధుడు తనదగ్గర అమ్మడానికి మరేమీ లేనట్లు ఓ గోడను అమ్మకానికి పెట్టాడు.
అది అంతోఇంతో కాదండోయ్.ఏకంగా రూ.41 లక్షలకు అమ్మకానికి ఉంచాడు మరి.ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… ఆ ప్రాంతంలో విశాలమైన ఇంటి ధరే రూ.10 కోట్లకు మించలేదట.అలాంటిది మనోడు కేవలం ఓ పాత గోడను అంత ధరకు ఎందుకు అమ్మకానికి పెట్టాడో అని అక్కడి స్థానిక జనం బుర్రగోక్కుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే, ఇది మనదగ్గర కాదండోయ్.అమెరికాలోని వాషింగ్టన్ డీసీ( Washington DC, USA ) రాష్ట్రం ఓల్డ్ జార్జిటౌన్‌లో ఉందీ గోడ.గోడలో కొంత భాగం అలెన్ బర్గ్, మరికొంత భాగం డేనియలా వాల్స్( Daniela Walls ) అనే మహిళ పేరు మీద ఉందట.ఇక అలెన్ నిర్లక్ష్యం వల్ల గోడ నుంచి నీరు లీక్ అవుతూ ఉండడంతో తన ఇల్లు దెబ్బతింటోందని డేనియెలా చాలా బాధపడుతుందట.ఈ క్రమంలో గోడ మరమ్మతుల కోసం చాలా ఖర్చు చేశానని అలెన్ చేతులెత్తేశాడు.
ఇద్దరి మధ్య గొడవల ముదిరి టౌన్ ప్లానంగ్ అధికారులకు వరకు వెళ్లింది.దాంతో గోడతో అంత ఇబ్బందిగా ఉంటే మీరే కొనుక్కోండి అంటూ అలెన్ దాన్ని రూ.41 లక్షలకు(50 వేల డాలర్లు) ఖరీదుకు అమ్మకానికి పెట్టాడు.

కాగా కూలిపోయే గోడకు అంత ఇచ్చేది లేదని, దానికి 600 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారుగా రూ.50 వేలు మాత్రమే ఇస్తానని డేనియెలా తేల్చి చెప్పింది.అంతేకాకుండా, పాతగోడకు అంత ఖరీదు ఎవరూ ఇవ్వరని అలెన్‌కు ఊరిపెద్దలు నచ్చజెబుతున్నా అతడు మాత్రం పట్టువీడలేదట.కాగా అంత ధరకు డేనియెలా కూడా కొనడానికి ససేమిరా అంటోంది.
ఆలెన్ ఈ గోడను అమ్ముతానని పత్రికల్లో ఫోటోతో సహా ప్రకటన ఇవ్వడంతో ఈ సంగతి వెలుగులోకి వచ్చింది.







