ఓ భారతీయుడికి రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ. 8.22కోట్లు వచ్చిపడ్డాయి.. ఎక్కడంటే?

ఓ భారతీయుడికి( Indian ) రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.8.22కోట్లు వచ్చిపడ్డాయి.మొదట అతగాడు నమ్మలేదండోయ్.

 An Indian Can Deposit Rs. 8.22 Crores Have Come And Gone Where , Indian, Deposit-TeluguStop.com

పొరపాటున అలా జరిగి వుంటుంది, తరువాత తన అకౌంట్ ని బ్యాంకువారు ఫ్రీజ్ చేస్తారని అనుకున్నాడు.కానీ అలా జరగలేదు.

అవును, ఆ సొమ్ము అతని సొంతమని తెలుసుకొని సంబరాలు చేసుకున్నాడు.విషయం ఏమిటంటే, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లో ఓ భారతీయుడికి ఈ జాక్‌పాట్ తగిలింది.భారత్‌కు చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడ( Shamshuddin Cheruvattantavita ) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియన్ డాలర్లు(రూ.8.22కోట్లు) గెలుచుకున్నాడు.దీంతో శంషుద్దీన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించాడు.

Telugu Deposit Rs, Dubaiduty, Indian, Jackpot, Latest-Latest News - Telugu

సెప్టెంబర్ 16న ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ నెం.1229కు ఈ లక్కీ లాటరీ తగిలినట్టు అతగాడు స్థానిక మీడియాకు తెలియజేశాడు.గత కొన్నేళ్లుగా జెబెల్ అలీలో( Jebel Ali ) ఉంటున్న అతడు గతేడాది నుంచి తన తొమ్మిది మంది స్నేహితులతో ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.ఇంత త్వరగా తమకు అదృష్టం వరిస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు.

ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తాన్ని తన మిత్రులతో పంచుకుంటానని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.తన వాటాలో కొంత మొత్తం స్వచ్ఛంద కార్యక్రమాలకు, మరికొంత తన సొంత అవసరాలకు వినియోగించుకొని, మిగిలిన సొమ్ముతో ఇల్లు కట్టుకుంటానని చెప్పుకొచ్చాడు.

Telugu Deposit Rs, Dubaiduty, Indian, Jackpot, Latest-Latest News - Telugu

ఇకపోతే కేరళ రాష్ట్రానికి చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.జెబెల్ అలీలో రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు పీఆర్ఓగా మనోడు పని చేస్తున్నాడు.ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే, 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇప్పటివరకూ 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో శంషుద్దీన్ 216వ వ్యక్తి కావడం విశేషం.కాగా, ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది భారతీయులేనని లాటరీ నిర్వాహకులు చెప్పడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube