కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలో ఉగ్రిక్తత వాతావరణం వైసీపీ కార్యకర్తలు టిడిపి కార్యకర్తలపై రాళ్లతో దాడి పలువురు పోలీసులకు గాయాలు పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అది చూసి ఒక్కసారిగా రెచ్చిపోయిన టిడిపి నాయకులు వైసిపి నాయకులు ఇంటిపైన రాళ్లతో దాడి టూ వీలర్ అద్దాలు ధ్వంసం సంఘటన స్థలానికి చేరుకున్న చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో బాబు వెంట నడిచిన కార్యకర్తలు.
కుప్పం పర్యటనలో కొల్లుపల్లి లో టీడీపీ అధినేత ప్రసంగం.
టీడీపీ ఓడిన ప్రతి సారి కుప్పం పై అయా ప్రభుత్వాల వివక్ష.రాజకీయం వేరు.
అభివృద్ధి వేరు అని నేను ఆలోచించాను.అందుకే పులివెందులకు నీళ్ళు ఇచ్చాను.
వైసీపీ ని పులివెందుల లోనే భూస్థాపితం చేస్తాను.పంచాయతీ ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచాం అని పుంగనూరు పుడింగి ఇక్కడ హడావుడి చేస్తున్నారు.
ఏమీ చేశారని ప్రజలను జగన్ ఓట్లు అడుగుతారు.బాబాయ్ ను చంపాను అని ఓట్లు అడుగుతారా?నేను పులివెందులను కుప్పం లా అభివృద్ధి చేద్ధాము అనుకున్నా.మీరు కుప్పాన్ని పులివెందుల చెయ్యాలి అనుకుంటున్నారు.ఒకరిద్దరు రౌడీఇజం చేస్తే టీడీపీ భయపడదు.వైసీపీ 175 గెలవడం కాదు.ఈ సారి పులివెందుల కూడా ఓడిపోతారు.
YSR CM గా ఉన్నప్పుడు లేపాక్షి హబ్ పేరుతో ఇందు అనే సంస్థకు 8500 ఎకరాలు ఇచ్చారు.ఇందులో అక్రమాలు జరిగాయి అని జగన్ జైలుకు కూడా వెళ్ళాడు.
ఇప్పుడు ఆ కంపెనీ దివాలా తీసిందని ఆ భూములు కొట్టేసే పరిస్థితి కి వచ్చారు.దివాలా పేరుతో 500 కోట్లు ఇచ్చి 9 నుంచి 18 వేల కోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారు.
జగన్ మేనమామ కొడుకే ఈ భూములు కొట్టేస్తునారు.పోరాటాలు చేసిన టీడీపీ పులివెందుల పిల్లికి భయపడదు.
పులివెందులలో జగన్ చెడబుట్టాడు…ప్రజలకు గౌరవం తెచ్చేలా నాయకుడు ఉండాలి.ప్రశాంతతకు మారు పేరైన కుప్పం లో డ్రామాలు మొదలు పెట్టారు.10 మంది రౌడీ లను మద్యం పోసి మాపై పురిగొల్పుతున్నారు.
పోలీసులు ఇలా నిర్వీర్యం అయితే ఎలా?మీ దగ్గర అవినీతి డబ్బు ఉంది…కుప్పానికి ఎన్నికల్లో లారీల్లో డబ్బు పంపుతాడు.అవినీతి డబ్బు మన కుప్పం ప్రజలకు వద్దు.ఒక ఎంపీ బట్టలు విప్పి తిరుగుతుంటే తప్పు అని సీఎం పిలిచి చెప్పాలి.ఎంపీతో సీఎం రాజీనామా చేయించాలి.కానీ ప్రశ్నించిన మాపై కేసులు పెడుతున్నారు.
ఇక్కడ గ్రానైట్ దొచేస్తుంటే వెళ్ళడానికి మాకు హక్కు లేదా?కుప్పం లో పోలీసులు మా వాళ్లపై కేసులు పెట్టారు.ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు చెయ్యాలా అని నాకూ అప్పుడప్పుడు అనిపిస్తుంది.
కానీ గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అని రాజకీయాల్లో ఉన్నాను ఉంటాను.కుప్పంలో ఎంతమంది నా కులం వాళ్ళు ఉన్నారు.
నాకు కులం అంటగడతారా?అందుకే కులం పేరు ఎత్తితే చెప్పు చూపించమని చెప్పాను.కులాల మత్తు నుంచి జనం బయటకు రావాలి.
జగన్ కు మానవత్వం ఉందా…నెల్లూరు లో దళితుడు ప్రాణం పోయినా స్పందించరా? ఇదొక పుటకేనా? నెల్లూరులో కుటుంబానికి డబ్బులు ఇచ్చి కేసు సెటిల్మెంట్ చేస్తారా?
.






