బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ( Amithabh Bacchan ) అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఈయన తన సినిమాలతో నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా ప్రేక్షకాదరణ పొందారు.
అలాంటి అమితాబ్ బచ్చన్ కి కేవలం సినిమాల మీద మాత్రమే కాదు క్రికెట్ ( Cricket ) అంటే కూడా చాలా ఇష్టం.క్రికెట్ మీద ఇష్టంతో వచ్చిన ప్రతి మ్యాచ్ ని మిస్ అవ్వకుండా చూస్తారట.
అయితే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్న అమితాబ్ బచ్చన్ ఈ క్రికెట్ ని లైవ్ లో చూడడానికి స్టేడియం కి మాత్రం వెళ్లరట.మరి అలా ఎందుకు వెళ్లారు అనే కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమితాబ్ బచ్చన్ ( Amithabh Bacchan ) స్టేడియం కి వెళ్లక పోవడానికి కారణం ఆయన సెలబ్రిటీ అవ్వడం వల్ల అక్కడున్న జనాలందరూ ఆయన దగ్గరికి ఆటోగ్రాఫ్ ల కోసం సెల్ఫీల కోసం వస్తారు అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్లే.ఎందుకంటే ఆయన స్టేడియం కి వెళ్లకపోవడానికి అసలు రీజన్ ఇది కాదు.అసలు విషయం ఏమిటంటే.ఎంతో ఇష్టం ఉన్న క్రికెట్ ని అమితాబచ్చన్ స్టేడియం కి వెళ్లి చూడకపోవడానికి అసలైన కారణం ఆయన స్టేడియం కి వెళ్లి చూస్తే తనకు ఇష్టం అయిన క్రికెట్ జట్టు రెండు మూడు సార్లు ఓడిపోయిందట.

ఇక ఈ కారణంతో తాను స్టేడియం కి వెళ్లడం కంటే తనకు ఇష్టం ఉన్న క్రికెట్ టీం గెలవడం ముఖ్యం అని తన ఇంటి దగ్గరే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిన సమయంలో టీవీలో లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తారట.ఇక ఈయన స్టేడియం కి వెళ్ళినప్పుడు రెండు సార్లు తనకి ఇష్టమైన టీం క్రికెట్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల దీన్ని సెంటిమెంట్ గా భావించి ఇంట్లోనే క్రికెట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తారట అమితాబ్ బచ్చన్.







