తల్లిపై నెటిజన్ సెటైర్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అమితాబ్ మనవరాలు!

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా.ఈ అమ్మడు తన తాత తరపున స్టార్ గా మారింది.

అంతేకాకుండా తనపై వస్తున్న ప్రేమ వ్యవహారాల గురించి వార్తల్లో బాగా నిలుస్తుంది.ఆమె ఓ బాలీవుడ్ నటుడు కొడుకు మీజాన్ జాఫ్రీ తో ప్రేమలో ఉన్నట్లు వారి మధ్య డేటింగ్ కూడా నడుస్తోందని పలు రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Amitabh Bachchan Grand Daughter Navya Strong Counter To Netizen, Amitabh Bachcha

ఇక నవ్య తన వ్యక్తిగత విషయం లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ముందుంటుంది.

అమితాబచ్చన్ కూతురు శ్వేత, నిఖిల్ ల కూతురే నవ్య.నవ్య న్యూయార్క్ లోని ఫోర్డామ్ యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఆరా హెల్త్ అనే పేరుతో ఆన్ లైన్ లో హెల్త్ కేర్ ను నడిపిస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే నవ్య.తన తల్లి పై ఓ నెటిజన్ సెటైర్ వేయగా అతడికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

ఇటీవలే నవ్య తన కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలపగా తన కుటుంబంలో ఉన్న మహిళలందరూ ఏదో ఒక పని చేస్తున్నారని తెలిపింది.దీంతో నేటి జన్ మీ అమ్మకి ఉద్యోగం లాంటివి ఏమీ లేదు గా అని కౌంటర్ వేయగా వెంటనే అతడికి దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది.

తన తల్లి ఒక రైటర్, డిజైనర్, హౌస్ వైఫ్, మాకు తల్లి అంటూ చెప్పుకొచ్చింది.అంతేకాకుండా తల్లిగా, భార్య గా ఉండటం ఫుల్ టైం జాబ్ అని, ఇంటి పనులన్నీ భుజాన వేసుకుని మహిళల గురించి చులకనగా మాట్లాడకండి అంటూ, ఒక తరాన్ని పెంచడంలో వాళ్ళ పాత్ర ముఖ్యమైనదని, వారిని చులకన చేసి మాట్లాడకుండా వారికి సపోర్ట్ గా నిలబడండి అంటూ తనదైన శైలిలో జవాబిచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు