మోడీ అమిత్ షా యోగి ! వామ్మో బీజేపీ గ్రేటర్ రాజకీయం ?

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు.

ఇక్కడ బలంగా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ ను బలహీనం చేసి,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు, జాతీయ నాయకులు సైతం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.

దీనికి గ్రేటర్ ఎన్నికలను వాడుకునేందుకు సిద్ధమైపోయారు.ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవడంతో మంచి హుషారుగా ఆ పార్టీ నాయకులు ఉన్నారు.

అదే ఉత్సాహంతో గ్రేటర్ లో మేయర్ పీఠం సొంతం చేసుకునేందుకు, బీజేపీ కి తిరుగు లేదు అని నిరూపించుకునేందుకు , అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే అన్ని పార్టీల కంటే మించిన స్థాయిలో గ్రేటర్ లో బీజేపీ స్పీడ్ పెంచింది.

కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులను ఇపుడు మోహరించి, ఎన్నికల ప్రచారం చేస్తోంది.కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తేజస్వి సూర్య, ఇలా ఎంతో మంది నేతలు గ్రేటర్ లో పర్యటించి టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు కురిపించారు.

Advertisement

నిన్ననే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం గ్రేటర్ లో పర్యటించారు.దిల్షుక నగర్ , కొత్తపేట, నాగోల్ లో ఆయన పర్యటించారు.

ఇక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.రోడ్ షో సైతం   నిర్వహిస్తారు.

అలాగే ఐదు గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆల్విన్ కాలనీ లో రోడ్ షోతో పాటు,  వివిధ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇక 29వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు.

ఉదయం 10:30 కు హైదరాబాద్ లో ఆయన అడుగుపెడతారు.అక్కడి నుంచి 11.30 గంటలకు ఓల్డ్ సిటీ కి వెళ్లి భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేస్తారు.ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో లో అమిత్ షా పాల్గొంటారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఆ తరువాత సనత్ నగర్,  ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Advertisement

ఇక నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం హైదరాబాద్ కు రానున్నారు.కీలకమైన కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.భారత్ బయోటెక్ ను ఆయన సందర్శించబోతున్నారు.

ఇక్కడ మోదీ చేసే ప్రకటన గ్రేటర్ బీజేపీకి సైతం కలిసి వచ్చే విధంగా ఉండబోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.ఇలా చెప్పుకుంటూ వెళితే , బీజేపీ గ్రేటర్ లో విజయం కోసం అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేస్తుండటం టిఆర్ఎస్ కు కాస్త ఆందోళన కలిగిస్తోంది.

తాజా వార్తలు