ఆఫరేషన్ తెలంగాణ : కొత్త టీమ్ లను రంగంలోకి దించిన అమిత్ షా 

తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ).

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) ఓటమి చెందడం, మూడో స్థానానికి పరిమితం కావడాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యం తో ముందుకు వెళుతున్నారు.

ఈ మేరకు తెలంగాణ బిజెపి నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.తెలంగాణలో డబల్ డిజిట్ స్థానాలను దక్కించుకునే వ్యూహం పై బిజెపి అగ్ర నేతలు ఫోకస్ చేశారు.

ఈ మేరకు ప్రత్యేకంగా కొన్ని టీమ్ లను ఏర్పాటు చేశారు.  ఈ టీమ్ తెలంగాణలో బిజెపి పరిస్థితి , అభ్యర్థుల గెలుపు అవకాశాలు,  ప్రత్యర్థి పార్టీల రాజకీయ వ్యవహారాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అమిత్ షాకు నివేదికలు పంపిస్తున్నాయి.

నాంపల్లి ( Nampally )లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేశారు.క్షేత్రస్థాయిలో మరో టీమ్ ను రంగంలోకి దించారు.

Advertisement

ఈ టీమ్ లు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రధాన కార్యాలయంలోని ఓ బృందం దీనిపై సమగ్రంగా ఒక నివేదికను తయారుచేసి అమిత్ షా కు పంపిస్తుంది.ఈ రెండు బృందాలు పనిచేస్తున్నట్లు అభ్యర్థులకు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారట.ఈ నివేదన పరిశీలించి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కార్యాలయం నుంచి సూచనలు అందే విధంగా ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల కు చెక్ పెట్టే విధంగా ఏం చేయాలి ?  స్థానిక నేతల నుంచి సరైన సహకారం లభించకపోతే ఏ విధంగా ముందుకు వెళ్లాలి ?  రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను ఏ విధంగా తిప్పుకొట్టాలి ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించే విధంగా ఏర్పాటు చేశారు.

ఇప్పటికే  రంగంలోకి దించిన ఈ  బృందాల పనితీరు మెరుగ్గా ఉందని , క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయిందనే నివేదికలు కూడా అమిత్ షాకు అందాయట.  దీంతో మరింత పగడ్బందీగానే ఈ టీమ్ ల సేవలను ఉపయోగించుకుని  తెలంగాణలో మెజార్టీ స్థానాలను దక్కించుకునే విధంగా వ్యవహారచన చేస్తున్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు