అమెరికా రాయబారి మెచ్చిన హైదరాబాద్ ఇరానీ చాయ్ కహానీ!

హైదరాబాద్ ఇరానీ చాయ్( Irani Chai ) గురించి మనం గొప్పగా చెప్పుకోవలసిన పనిలేదు.ఎవరో బయటివారు చెప్పుకుంటే మనకి గొప్పగా, గర్వంగా ఉంటుంది.

 American Ambassador Praised Hyderabad Irani Chai Kahani, American Ambassador, Hy-TeluguStop.com

అయితే ఆ బయటివాడు అగ్రరాజ్యానికి చెందిన ప్రముఖుడు అయితే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరప్పా అని అంటారు కదూ.నిజమే ఇక్కడ అదే జరిగింది.కొత్తగా బాధ్యతలు చేపట్టిన అమెరికా రాయబారి హైదరాబాద్ పర్యటనకు వచ్చి చార్మినార్‌ను( Charminar ) సందర్శించిన నేపథ్యంలో ఇరానీ చాయ్ సేవించారు.తరువాత ఉండబట్టలేక చార్మినార్‌ను, ఇరానీ చాయ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ పెట్టారు.

దాంతో ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అవును, భారత్‌లో కొత్తగా నియమితులైన యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి ( Eric Garcetti )చార్మినార్‌ను సందర్శించారు.ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన నిమ్రా కేఫ్‌లో ఇరానీ చాయ్ తాగారు.అంతేకాకుండా ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన ఉస్మానియా బిస్కెట్లను కూడా రుచి చూశారు.

అనంతరం అక్కడ తాను దిగిన ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసి, ‘తెలంగాణకు చార్మినార్ ఎందుకు ప్రసిద్ధమైందో అర్ధం చేసుకోవడంలో మంచి కిక్కు వుంది.అవును, 500 సంవత్సరాల అందమైన చరిత్రకు ఈ ప్రాంతం అద్దం పడుతోంది.ఇక్కడ చాయ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.’ అనే టెక్స్ట్ జోడించారు.

దాంతో ఆయన షేర్ చేసిన ఫోటోలకు చాలామంది కామెంట్లు పెట్టడం జరిగింది.ఈ క్రమంలోనే ఇంకా హైదరాబాద్‌లో చూడదగిన ప్రాంతాలను ఆయనకు మన అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.అమెరికా 247వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల( Independence Anniversary Celebrations ) సందర్భంగా హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్‌ను ఒకరోజు ముందు ఆయన ప్రారంభించడం జరిగింది.అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన గార్సెట్టి అధికారిక పర్యటనలో భాగంగా మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చి, చార్మినార్ సందర్శనకంటే ముందు ఆయన చారిత్రాత్మక చౌమహల్లా ప్లాలెస్‌ను, రాయ్ దుర్గ్‌లోని టి-హబ్‌ను సందర్శించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube