ప్రాణాంతక వ్యాధి గుట్టు రట్టు చేసిన అమెరికా..

అమెరికాలో అత్యంత ప్రమాదకర వ్యాధిగా పరిగణిస్తున్న ఓ వ్యాధి తాలూకు మూలాలని ఎట్టకేలకి అమెరికా శాస్తవేత్తలు గుర్తించారు.

జీన్ ఎడిటింగ్ టూల్ సీఆర్‌ఐఎస్‌పీఆర్/సీఏఎస్9ను ఉపయోగించి అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రాణాంతకమైన శ్వాస సంభంద వ్యాధికి గల కారణాలని, అది నిర్మూలించాబడే విధంగా తిరుగులేని చికిత్స ని కనుగొన్నారు.

అమెరికాలోని వాషింగ్టన్ లో గత కొంత కాలంగా పుడుతున్న పిల్లలకి శ్వాస సంభందిత రోగాలు వచ్చి తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యే వారు.ఈ కారణంగా ఎంతో మంది తల్లి తండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

దాంతో ఆర్ధికంగా, మానసికంగా పిల్లల తల్లి తండ్రులు కష్టాలు పడే వారు.దాంతో అక్కడ పరిస్థితులపై ఎన్నో పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి.

ఈ వ్యాధి సోకిన పిల్లల శరీరం నీలి రంగులోకి మారడంతో పాటు, పెదవులు కూడా నీలి వర్ణం లోకి మారిపోతాయట.ఈ రకమైన వ్యాధిని అల్‌వెయొలార్ కాపిల్లరి డిస్‌ప్లాసియా విత్ మిస్‌అలైన్‌మెంట్ ఆఫ్ పల్‌మనరి వెయిన్స్ అని పిలుస్తారు.

Advertisement

అమెరికాలోని సిన్సినాటి చిల్డ్రన్స్ ఆసుపత్రికి చెందినా పరిశోధకులు ఈ వ్యాధికి కారణాలని కనుగొనడంతో పాటు చికిత్సని కూడా కనుగొన్నారు.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..
Advertisement

తాజా వార్తలు