వామ్మో.. ఇంత పెద్ద భవనమా.. అసలు అందులో ఏముందంటే..?!

ప్రపంచమంత ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది.ఊహించుకోవడానికి ఆ ఊహానే బాగుంది కదా.

 America Alaska Whittier Where Residents Live In One Building Details, Longest Bu-TeluguStop.com

కానీ ఒక అందమైన పట్టణంలో నివసించే వారందరి ప్రపంచం ఒకే భవనంలో ఉంది.అలా ఎలా అనుకుంటున్నారా? భవనం అంటే అందరూ మాములుగా అనుకునేది.చాలా ఫ్యామిలీస్ ఉంటాయి.లేకపోతే, కొన్ని షాప్స్, ఆఫీసులు ఉంటాయి అనుకుంటారు.కానీ ఓ భవనంలో ఏకంగా పోలీస్టేషన్, షాప్స్, మాల్స్, హాస్పిటల్స్, హోటల్స్, టెంపుల్స్, ఇవే కాకుండా ఒక పట్టణంలో నివసించే అంత జనాభ అంతా ఒకే చోట ఉంది.ఇది చూడటానికి చాలా అందమైన పట్టణం కానీ ఓకే బిల్డింగ్‌లో ఉటుంది.

ఇలా ప్రతి సదుపాయం ఉన్న భవనం ఇప్పుడు ప్రతి ఒక్కరిని తనవైపు ఆకర్షించుకుంటుంది.ఇంతకీ ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా.? అమెరికాలోని అలాస్కాలో విట్టియర్ అనే అదమైన, అరుదైన పట్టణం ఉంది.ఇది నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది.

అందువలన అక్కడ మొత్తం జనాభ 200.వీరిలో దాదాపు 180 మంది పట్టణంలోని బిగిచ్ టవర్స్ అనే భవనంలో ఉంటారు.ఎందుకంటే ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండటం వలన రవాణ, రక్షణ అనేది ఇబ్బందిగా ఉంటుంది.దీంతో వారికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఒకే బిల్డింగ్‌లో ఏర్పాటు చేసింది.

Telugu Alaska, Alaska Whittier, America, Longest, Live, Latest, Whittier-Latest

కానీ పాపం విద్యార్థులకు స్కూల్ మాత్రం ఆ బిల్డింగ్‌లో ఏర్పాటు చేయలేకపోయింది.దీంతో భవనానికి కొద్ది దూరంలో ప్రభుత్వం పాఠశాలను ఏర్పాటు చేసింది.ఆ పాఠశాలకు విద్యార్థులు ఓ సొరంగ మార్గం ద్వారా చేరుకుంటారు.ఇలా మంచుతో కప్పబడిన ప్రాంతం ప్రస్తుతం పర్యటకులను ఆకర్షిస్తుంది.దీన్ని చూడటానికి ఇతర దేశాల నుంచి చాలా మంది విట్టియర్ పట్టణానికి చేరుకుంటున్నారు.అంతే కాదండోయ్.

పర్యటకులు బస చేసేది కూడా అదే భవనంలోనంట.మరి ఇంకెదుకు లేటు, భవనంపై మీరు ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube