తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ హీరో సుహాస్ ( Suhas )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుహాస్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కలర్ ఫోటో.
ఈ మూవీతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకున్నాడు సుహాస్.ఇది ఇలా ఉంటే సుహాస్ ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే సుహాస్ తాజాగా నటించిన చిత్రం అంబాజీపేట( Ambaji peta ) కాగా తాజాగా సినిమా టీజర్ విడుదల చేసారు మేకర్స్.

కేరాఫ్ కంచరపాలెం తీసిన వెంకటేష్ మహా( Maha Venkatesh ), గీతా2 బన్నీవాస్ కలిసి సమర్పిస్తున్న ఈ లవ్ స్టోరీని ధీరజ్ మొగిలినేని నిర్మించారు.టీజర్ లో దాదాపు సినిమా కథ మొత్తం ఎట్ ఎ గ్లాన్స్ లో చెప్పేసారు.సెలూన్ నడిపుతూ, మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే కుర్రాడు సుహాస్ ప్రేమ కథ,అది కూడా ఒక పల్లెటూరి కట్టుబాట్లు, పద్దతుల నేపథ్యంలో రూపొందింది.
టీజర్ ను సినిమా మాదిరిగానే కట్ చేసారు.

సున్నితంగా, ఆహ్లాదంగా సాగుతూ వెళ్లి, శిరోముండనం లాంటి ఇంటెన్సివ్ సీన్ తో ఎండ్ అయింది.శిరోముండనం అన్నది గోదావరి జిల్లాల్లో చాలా సంచలనమైన విషయం.అలాంటి సీన్ ను సినిమాలోకి తీసుకువచ్చారు అంటే కాస్త డెప్త్ కి వెళ్లినట్లే కనిపిస్తోంది.
దర్శకుడు దుష్యంత్ తన స్టామినా ను తెరపైకి బాగానే తీసుకువచ్చారు.శేఖర్ చంద్ర బ్యాక్ గ్రవుండ్ సినిమా టైటిల్ కు తగినట్లు బాగానే సెట్ అయింది.







