పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేట మండలం: అంబడిపూడి కృష్ణా నదిలో గుర్తించిన పురాతన విగ్రహాలు.నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం రెండు నందుల రాతి విగ్రహాలను గుర్తించిన గ్రామస్తులు.
కృష్ణానది ఎగువ భాగం నుంచి కొట్టుకుని వచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగు బాగాన వున్నవి ప్రస్తుతం బయటపడ్డాయా అనే విషయం తెలియాల్సివుంది.రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన విగ్రహాలను తిలకించెందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు.