కొత్తగా వచ్చిన ప్రైమ్ వీడియో ఇంటర్‌ఫేస్ వివరాలు తెలుసుకోండి!

కరోనా సమయం నుండి ప్రజలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి బాగా అలవాటు పడ్డారు.ఈ క్రమంలో అందుబాటులో వున్న ఓటీటీలలో ‘ప్రైమ్ వీడియో’ మంచి ఫామ్ లో వుంది.

 Amazon Prime Video New Interface Details, Amazon Prime, Members, Good News, New,-TeluguStop.com

దాంతో యూజర్లకోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ టెస్టు వుంది.ఈ నేపథ్యంలోనే అమెజాన్ తమ యూజర్స్‌కు కొత్త ఇంటర్‌ఫేస్ అందించనుంది.

వినియోగదారులు కంటెంట్‌ను సులభంగా కనుగొనేలా ఇంటర్‌ఫేస్ ని అభివృద్ధి చేసారు.అయితే ఇపుడు ఇంటర్‌ఫేస్ అప్డేట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం.

ప్రైమ్ వీడియో నావిగేషన్ మెనూ సులువుగా ఉండేలా కొత్త ఇంటర్‌ఫేస్ రూపొందించింది.యాప్ ఇకపై హోమ్, స్టోర్, ఫైండ్, లైవ్ టీవీ, మై స్టఫ్ అనే ఐదు ప్రాథమిక పేజీలతో ప్రారంభించబడుతుంది.

స్టోర్ విభాగంలో ‘ఆల్’ ‘రెంట్’ ‘చానెల్స్‌’ వంటి ఆప్షన్స్ మీకు ఇపుడు కనిపిస్తాయి.ప్రైమ్‌లో ఏ కంటెంట్ చేర్చబడిందో, అద్దెకు లేదా యాడ్-ఆన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏది అందుబాటులో ఉందో సులభతరం చేసే ఫీచర్స్ న్యూ ఇంటర్‌ఫేస్ కలిగి ఉండటం విశేషం.

కస్టమర్స్ కోసం అందుబాటులో ఉన్న వీడియోలు ‘బ్లూ కలర్’ చెక్‌మార్క్ చిహ్నంతో గుర్తించబడితే, అద్దెకు లేదా సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉన్నవి ‘గోల్డ్ షాపింగ్’ ఐకాన్‌తో గుర్తించబడతాయి.అలాగే, కస్టమర్స్ ‘మై సబ్‌స్క్రిప్షన్స్’ రోలో తాము సబ్‌స్క్రైబ్ చేసిన చానెల్స్‌, వారి ప్రైమ్ మెంబర్‌షిప్‌తో సహా అన్ని వీడియోలను యాక్సెస్ చేయవచ్చు.

Telugu Amazon Prime, Interface, Search, Prime Interface, Videis-Latest News - Te

కొత్తగా ప్రారంభమయ్యే ప్రోగ్రామింగ్ లిస్ట్, ఏ రోజు రాబోతున్నాయో వంటి వివరాలు కూడా తెలిసిపోతాయి.ఇందులో ఏదైనా లైట్ స్టేషన్‌ని వీక్షించవచ్చు లేదా కొత్త చానెల్ కోసం కొత్త సభ్యత్వాన్ని ప్రారంభించేందుకు క్లిక్ చేయవచ్చు.పర్టిక్యులర్ కంటెంట్ సెర్చ్ చేసేందుకు లేదా జానర్స్, కలెక్షన్స్ అన్వేషించేందుకు ఉపయోగపడుతుంది.వినియోగదారులు టైప్ చేస్తున్నప్పుడు సెర్చ్ సజెషన్స్ ప్రత్యేకంగా కనబడనున్నాయి.జానర్, లాంగ్వేజ్, వీడియో నాణ్యత ద్వారా రిజల్ట్స్ ఫిల్టర్ చేయబడును.మొత్తంగా చూసుకుంటే ఒకప్పటికంటే ఇపుడు యూజర్ ఫ్రెండ్లీగా వుండబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube