క్రియేటివ్ గా అసలు విషయాన్ని చెప్పేసిన అమెజాన్..!

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఓటి ఫ్లాట్ ఫామ్ లో ఉన్న పోటీని ఎదుర్కొని తన సత్తా ఏంటో రోజు రోజుకు నిరూపించుకుంటూ ముందుకు దూసుకువెళ్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో.

ఈ అమెజాన్ ప్రైమ్ లో భాగంగా ఒరిజినల్ కంటెంట్ మాత్రమే కాకుండా సినిమాలు కూడా హెచ్డి క్వాలిటీతో ప్రపంచంలోని అనేక దేశాలలో సర్వీసును అందిస్తోంది.అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.అమెజాన్ ప్రైమ్ వీడియో పేరులో ఉన్న ఎమ్ఈ అక్షరాలను తొలగించి వేర్ ఈజ్ ఎమ్ఈ ( #WhereIsME) అనే హ్యాష్ ‌ట్యాగ్ ‌తో అమెజాన్ అనేక ట్వీట్స్ సంధిస్తోంది.

వీటితోపాటు సూపర్ హిట్ అయిన సినిమాల్లోని డైలాగులను తీసుకొని అందులో ఎమ్ఈ అనే అక్షరాలను తొలగించి వేర్ ఈజ్ ఎమ్ఈ ( #WhereIsME) హ్యాష్ ‌ట్యాగ్ ను వైరల్ చేస్తోంది.అయితే ఇందుకు కారణం లేకపోలేదు.

Advertisement

ఇందుకు కారణం ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లాగానే అమెజాన్ ప్రైమ్ కూడా తమ వినియోగదారుల కోసం మొబైల్ ఎడిషన్ ను ప్రవేశపెట్టిన కారణం చేత ఆ విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో కాస్త క్రియేటివ్ గా ఆలోచించి ఈ నిర్ణయాన్ని చేపట్టింది.భారత్ లో అధిక శాతం కంప్యూటర్ కంటే మొబైల్ వాడకం ఎక్కువ కాబట్టి వారికోసం అమెజాన్ ప్రత్యేకంగా ఓ మొబైల్ ఎడిషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.స్ట్రీమింగ్ ఎంగేజ్మెంట్ లో భారత్ మొదటి స్థానంలో ఉండటం కారణంగా కస్టమర్లకు మరింత హై క్వాలిటీ కంటెంట్ అందించాలన్న ఉద్దేశంతో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రారంభించామని అమెజాన్ ప్రతినిధులు తెలుపుతున్నారు.

ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?
Advertisement

తాజా వార్తలు