అమెజాన్‌కు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ఆదేశం

అమెజాన్‌కు కేంద్రం ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు జారీ చేసింది.కార్ల‌లో సీట్ బెల్ట్ అలారం రాకుండా ఉండేలా రూపొందించిన ప‌రిక‌రాల‌ను విక్ర‌యించ‌డాన్ని నిలిపివేయాల‌ని తెలిపింది.

ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మ‌న్ దుర్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే.ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న సీట్ బెల్ట్ పెట్టుకోలేద‌ని తేలింది.

కారు నడుపుతున్న సమయంలో సీట్‌బెల్టులు ఉపయోగించని సమయంలో అలారమ్‌ వస్తుందని, అలా రాకుండా ఉండేందుకు అమెజాన్‌లో అందుబాటులో ఉన్న మెటల్‌ క్లిప్‌లను వినియోగిస్తున్నారన్నార‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు.ఈ క్ర‌మంలోనే అమెజాన్ వాటి విక్ర‌యాల‌ను ఆపాల‌ని నోటీసులు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

డ్రైవర్‌, ముందు సీట్‌తోపాటు వెనుకలా ఉండే సీట్లబెల్ట్‌లకు కూడా అలారాన్ని తప్పని సరి చేయాలని కేంద్రం యోచిస్తుందని స్ప‌ష్టం చేశారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు