ఆవాలే క‌దా అనుకుంటే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో చూడండి!

ఆవాలు.ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే పోపు దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి.

చిట్టి, పొట్టిగా ఉండే ఆవాల‌తో బోలెడ‌న్నీ లాభాలు ఉన్నాయి.ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు.

కూర‌కు చ‌క్క‌ని రుచిని, శ‌రీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.ఎన్నో జ‌బ్బుల‌ను నివారించ‌డంలోనూ ఆవాలు అద్భుతంగా స‌హ‌య‌ప‌డ‌తాయి.

మ‌రి అవేంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి. జ‌లుబు, దగ్గు మ‌రియు శ్వాసకోశ సమస్యల‌తో బాధ‌ప‌డేవారు ఆవాల‌ను పొడి చేసుకుని.

Advertisement
Amazing Health Benefits Of Mustard Seeds! Health Benefits Of Mustard Seeds, Must

అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే జ‌లుబు, దగ్గు మ‌రియు శ్వాసకోశ సమస్యలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ ఆవాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

Amazing Health Benefits Of Mustard Seeds Health Benefits Of Mustard Seeds, Must

ప్ర‌తిరోజు వేడినీటిలో ఆవాల పొడిని చేర్చి తీసుకుంటే.శ‌రీరంలో అద‌న‌పు కొలెస్ట్రాల్ క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేస్తుంది.అలాగే ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్ వంటి భ‌యంక‌ర స‌మ‌స్య‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.

ఇక ఆవాల్లో ఉండే కాల్సియం, మెగ్నీషియం, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.మలబద్ధకాన్ని నివారించే శ‌క్తి కూడా ఆవాల‌కు ఉంది.ప్ర‌తిరోజు రెండు, మూడు గ్రాముల చ‌ప్పున ఆవాలు తీసుకుంటే.

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచి.మ‌ల‌బ‌ద్ధాకాన్ని నివారిస్తుంది.

Advertisement

అలాగే ఆవాల‌ను ఏదో ఒక రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

తాజా వార్తలు