కాప్సికమ్ తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

కాప్సికమ్ ఎరుపు,పసుపు,ఆకుపచ్చ రంగులలో దొరుకుతుంది.దీనిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

కాప్సికమ్ ని కూరల్లోనూ,పలావ్,మసాలా కూరల్లోనూ ఎక్కువగా వాడతారు.ఇదివరకు మీద పోలిస్తే కాప్సికమ్ వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి.

Amazing Health Benefits Of Capsicum , Dietary Fiber, Calcium, Iron, Capsicum, P

ఇప్పుడు కాప్సికమ్ వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.కాప్సికమ్ లో విటమిన్ సి, ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, ఇ, కేలరీలతో ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

కాప్సికమ్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు అధికంగా ఉండుట వలన వాపులు,నొప్పులు తగ్గించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.ముఖ్యంగా కీళ్లనొప్పులు ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.

Advertisement

క్యాప్సికంలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరచటంలో సహాయపడి.ఆయా అవయవాల్లో ఉండే కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూస్తాయి.

అంతేకాక రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.కాప్సికమ్ అనేది మధుమేహ రోగులకు అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు.

రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.అలాగే ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విధంగా ప్రేరేపణ చేస్తుంది.

క్యాప్సికంలోని విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఆస్తమాను తగ్గించేందుకు ఉపయోగపడడంతోపాటు ఇవి దెబ్బ తిన్న మెదడు కణాలకు మరమ్మత్తులు చేస్తాయి.ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

కంటి చూపును మెరుగుపరిచే ఈ మూడు ఆకుకూర‌లు తింటున్నారా?
Advertisement

తాజా వార్తలు