ఎండిన మామిడాకుల‌తో ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలుసా?

ప‌ల్లెటూర్ల‌లో దాదాపు ప్ర‌తి ఒక్క‌రి పెర‌టిలోనూ ఓ మామిడి చెట్టు ఖ‌చ్చితంగా ఉంటుంది.అయితే మామిడి చెట్టుకు కాసే మామిడి పండ్ల‌ను అంద‌రూ ఇష్టంగా తింటుంటారు.

కానీ, మామిడాకుల‌ను మాత్రం ప‌ట్టించుకోరు.ఏదైనా పండ‌గ‌కు, శుభ‌కార్యానికి మామిడాకుల‌ను ఇంటికి తోర‌ణాలుగా క‌డ‌తారు.

అంత‌కు మించి వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ఉండ‌వ‌ని న‌మ్ముతారు.కానీ, మామిడాకుల్లోనూ ఎన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.

ముఖ్యంగా ఎండిన మామిడాకుల‌తో అనేక ఆరోగ్య లాభాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు ఎండిన మామిడికుల‌తో ఏయే హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు చూసేయండి.

Advertisement
Amazing Benefits Of Dry Mango Leaves , Benefits Of Dry Mango Leaves , Dry Mango

ప్ర‌స్తుత రోజుల్లో ఒత్తిడి వ‌ల్ల మాన‌సికంగా న‌లిగిపోతున్న వారు ఎంద‌రో ఉన్నారు.అయితే అలాంటి వారికి ఎండిన మామిడాకుల‌తో త‌యారు చేసే టీ బెస్ట్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

అందు కోసం ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే.

అందులో ఒక స్పూన్ ఎండిన మామిడాకుల పౌడ‌ర్ వేసి ప‌ది నిమిషాల పాటు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఆపై టీను ఫిల్ట‌ర్ చేసి రుచికి స‌రిప‌డా తేనె క‌లిపి సేవించాలి.

ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్ అవుతాయి.

Amazing Benefits Of Dry Mango Leaves , Benefits Of Dry Mango Leaves , Dry Mango
న్యూస్ రౌండప్ టాప్ 20

అలాగే ఈ టీను తాగ‌డం వ‌ల్ల జలుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి సీజ‌న‌ల్ స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ర‌క్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.శ‌రీరంలో పేరుకున్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

Advertisement

మ‌రియు శ్వాస సంబంధి సమస్యల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇక ఇంట్లో దోమ‌ల‌ను త‌రిమి కొట్ట‌డంలోనూ ఎండిన మామిడాకులు గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అవును, నిప్పుల్లో ఎండిన మామిడాకుల పొడిని వేసి ఇంట్లో ధూపంలా పెడితే గ‌నుక‌.దెబ్బ‌కు దోమ‌ల‌న్నీ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

తాజా వార్తలు