Amardeep : అమర్ దీప్ బిగ్ బాస్ జర్నీ పై బుక్ ప్రిపేర్ చేసిన ఫ్యాన్స్?

అమర్ దీప్ చౌదరి(Amar deep Chowdary) పరిచయం అవసరం లేని పేరు.

ఈయన బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అమర్ అనంతరం బిగ్ బాస్ ( Bigg boss ) అవకాశాన్ని అందుకున్నారు.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచి బయటకు వచ్చినటువంటి అమర్ తరువాత ఏ ఇంటర్వ్యూలను కూడా సందడి చేయలేదు ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఈయన తన భార్య అలాగే స్నేహితులతో కలిసి వెకేషన్ వెళ్ళిపోయారు.

అయితే మొదటిసారి అమర్ బుల్లితెర కార్యక్రమం అయినటువంటి స్టార్ మా పరివార్ కార్యక్రమంలో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు.దీంతో అమర్ కి కూడా ఈ కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈయనకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక ఈ కార్యక్రమానికి ఈయన అభిమానులు కూడా వచ్చారు.

ఈ సందర్భంగా అమర అభిమానులు వేదికపై మాట్లాడుతూ అన్న మీరు బిగ్ బాస్ కార్యక్రమంలో రన్నర్గా నిలిచినప్పటికీ మా దృష్టిలో మాత్రం మీరు ఎప్పుడూ విన్నర్ అంటూ మాట్లాడారు అంతేకాకుండా అమర్ బిగ్ బాస్ జర్నీ గురించి ఒక పుస్తకం ( Book ) కూడా వీళ్ళు తయారు చేసి అమర్ చేతుల మీదుగానే ఆ పుస్తకాన్ని ఆవిష్కరింప చేశారు.ఇక ఇందులో తన అభిమానుల పేర్లను కూడా పొందుపరిచారు అయితే శ్రీముఖి ఈ పుస్తకాన్ని చూపిస్తూ ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఎవరికి కూడా ఇలా పుస్తకాలను తయారు చేయలేదు రా నీకు చేశారు అంటే నువ్వు గెలిచేసావు తమ్ముడు అంటూ ఈమె కామెంట్ చేశారు.అంతే కాకుండా ఆ పుస్తకంలో కొంతమంది అభిమానుల పేర్లను కూడా చదివారు.

రేయ్ అమర్ ఇదేంట్రా అంత అమ్మాయిల పేర్లు ఉన్నాయి.ఇంటికి వెళ్తే తేజు చేతిలో నీకు మూడిందిరో అంటూ శ్రీముఖి అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు.ఇలా ఈ వేదిక పైకి మొదటిసారి కనిపించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ఇక బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమర్ ఈ కార్యక్రమం తర్వాత తన కెరియర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.అయితే ఇప్పటికీ అమర్ కు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయన్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

రవితేజకు ఎంతో అభిమాని అయినటువంటి ఈయనకు ఏకంగా రవితేజ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు