భార్య మెటర్నటీ ఫోటో షూట్ కోసం లక్షలు ఖర్చు చేసిన అవినాష్.. ఫోటోలు వైరల్!

బుల్లితెరపై ప్రసారమైనటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ లభించిందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Latest News About Jabardasth Comedian Avinash, Comedian Avinash, Jabardasth, Pra-TeluguStop.com

ఇలా జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ముక్కు అవినాష్ ( Mukku Avinash )ఒకరు.ఈ కార్యక్రమంలో కమెడియన్ గా సందడి చేసినటువంటి ఈయనకు బిగ్ బాస్( Bigg Boss ) అవకాశం రావడంతో జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి అవినాష్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇకపోతే అవినాష్ ఇటీవల పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటు సినిమాల పరంగా కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక అవినాష్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ఈయన అనూజ( Anuja ) అనే అమ్మాయిని గత రెండు సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం తన భార్య గర్భిణి ( Pragnent ) అనే విషయాన్ని కూడా అవినాష్ వెల్లడించారు.గతంలో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయం గురించి తెలియజేయడమే కాకుండా ఐదవ నెలలో తన భార్యకు జరిగిన సీమంతపు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.

ప్రస్తుతం అవినాష్ భార్య 9వ నెలలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది.దీంతో మరోసారి ఘనంగా సీమంతపు వేడుకలను నిర్వహించారు.అంతేకాకుండా తన భార్య గర్భిణీగా ఉండడంతో అవినాష్ తన భార్యకు మెటర్నరీ ఫోటోషూట్ నిర్వహించారు.ప్రస్తుత కాలంలో ఇలాంటి ఫోటోషూట్లు జరగడం సర్వసాధారణం అయితే తన భార్య ఇష్టం మేరకు ఏకగా లక్షలు ఖర్చు చేసి అవినాష్ తన భార్య మెటర్నటీ ఫోటో షూట్ చేయించారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి కొద్ది రోజులలో ఆ అవినాష్ అనూజ దంపతులు తల్లిదండ్రులుగా ప్రేమ అవ్వబోతున్నారని తెలియడంతో ముందుగానే అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

https://www.facebook.com/reel/677159210950829
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube