ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు.అయితే ఇంటిలో సమస్యను రచ్చకి ఈడిస్తే పరిష్కారం రావడం అంత సులభం కాదు.
విషయం ఏమిటంటే… అమరావతి పోరాటం దిల్లీకి తరలి వెళ్ళింది.దాదాపు 15,000 మందికి పైగా అమరావతి మద్దతుదారులు, భూములు ఇచ్చిన నష్టపోయిన రైతులు రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు.
ఒకే రాష్ట్రం… ఒకే రాజధాని అంటూ అమరావతి వాణిని గట్టిగా వినిపిస్తున్నారు.పార్లమెంటు సెషన్లు జరిగే సమయంలో జంతర్ మంతర్ వద్ద వేరంతా కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
ఇక వీరికి ఇప్పటికే టీడీపీ, జనసేన, రాష్ట్ర బిజెపి సపోర్టు ఉంది.కమ్యూనిస్టులతో పాటు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేయగలిపి అమరావతి మద్దతుగా నిల్చున్నారు.
మరి రాష్ట్రంలో జరిగే ఎన్నో ధర్నాలపై జగన్ నోరు మెదపడు… అలాంటిది ఎక్కడ ఢిల్లీకి వెళ్లి మన ఘోష వినిపిస్తే ఇక్కడ కుర్చీలు కదులుతాయి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది జేఏసీ ఆలోచించుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం అమరావతి విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని, ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలపై అధికారం పై తమ ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఎప్పుడో తేల్చిచెప్పింది.
అదీ కాకుండా కోర్టు వారు కూడా కేవలం స్టే ఆర్డర్ ఇవ్వగలరు గాని పరిపాలన వ్యవహారాలలో తలదుర్చే అవకాశం లేదు.

కాబట్టి ఎన్నికలకు ఇంకా 16 నెలలు మాత్రమే ఉన్న సమయంలో రాష్ట్రంలోనే వేడి పెంచి వైసిపి నేతలకు చెమటలు పట్టించాలి కానీ ఢిల్లీలోనే చల్లగాలిలో గొంతు చించుకుంటే వచ్చే ఉపయోగం ఏమిటన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న సమస్యను కేంద్ర స్థాయికి తీసుకొని వెళ్తే అది వారి చేతిలో పని అయి ఉండాలి.జగన్ ఇక్కడ మరికొన్ని నెలల్లో ఓట్ల కోసం జనాల వద్దకు వస్తాడు.అతి కీలకమైన అమరావతి పరిసర ప్రాంతాలలో ఆయన కేడర్ కనిపించిన ప్రతీసారి నిలదీస్తే తప్పించి వైసిపి సర్కార్ పై ఒత్తిడి పడదు.అక్కడి నుంచి వారు వెనకడుగు వేశారంటే ప్రతిపక్షాలకి ఇది ఎంతో ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి ప్రతిపక్షాలైన కనీసం ఈ విషయంపై ఆలోచించి వీరికి దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది.







