అమరావతిని చుట్టుముడుతున్న కొత్త వివాదాలు ? ఈ ట్విస్ట్ ఏంటో ?

మొదటి నుంచి అమరావతి వ్యవహారం పెద్ద చిక్కుముడిగా ఉంటూ వస్తోంది.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి దాన్ని వ్యతిరేకించడం వంటివి జరిగాయి.

అయినా అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతి వైపు మొగ్గు చూపించింది.ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో అమరావతి వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.

అయినా, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి రాజధాని తరలింపు చేయడానికి వీల్లేదంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఇంకా జరుగుతూనే ఉంది.

ఈ వ్యవహారం రోజురోజుకు ఇబ్బందికరంగా మారడంతో, దీనికి కౌంటర్ గా వైసిపి కూడా సరికొత్త ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తోంది.మూడు రాజధానులకు అనుకూలంగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి.

Advertisement

తాజాగా మంగళగిరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారు ఆటోల్లో వెళుతుండగా కృష్ణయ్య పాలెం లో కొంతమంది అడ్డుకున్నారని వారంతా టిడిపి మద్దతుదారులు అని, వారు రిలే దీక్షలకు వెళ్తున్నమహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారంతా అమరావతి మద్దతుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారేనని, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ భూములను తీసుకుని పేదలకు ఉచితంగా ఇవ్వడం ఏంటి అంటూ అమరావతి కి మద్దతుగా పోరాటం చేస్తున్న వారు వ్యాఖ్యానించడం వివాదంగా మారింది.

ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.మూడు రాజధానులకు మద్దతుదారులు, వ్యతిరేకించేవారు ఒకరిపై ఒకరు దూషణలకు దిగడం, దాడులకు తగబడడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలకు వెళ్తున్న వారిని ట్రాక్టర్లతో తొక్కిస్తాము అంటూ టిడిపి మద్దతుదారులు హెచ్చరించినట్లు మహిళలు వాపోయారు.మొత్తంగా ఈ వ్యవహారం చూస్తే అమరావతికి మద్దతుగా ఒక వర్గం, మూడు రాజధానులకు మద్దతుగా మరో వర్గం ఇలా ఈ వ్యవహారం పెద్ద తలనొప్పి గానే మారే అవకాశం కనిపిస్తోంది.

ఈ వ్యవహారాల వెనుక ఉన్న టీడీపీ వైసీపీ మాత్రం ఇవేవి తమకు సంబంధంలేని విషయాలు అన్నట్టుగానే చోద్యం చూస్తున్నాయి.

ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి
Advertisement

తాజా వార్తలు