తల్లి, భార్య జోలికి వస్తే ఇంటికి వచ్చి కొడతా.. నీచమైన బ్రతుకులు అని కామెంట్లు చేస్తూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss ) కొంతమంది కెరీర్ కు ప్లస్ అయితే ఎక్కువమంది కెరీర్ కు మైనస్ అవుతోంది.ఈ షోలో చిన్న తప్పు చేసినా లైఫ్ లాంగ్ ఆ ప్రభావం కెరీర్ పై ఉంటుంది.

 Amar Deep Mother Emotional Comments Goes Viral In Social Media Details, Amardeep-TeluguStop.com

వితిక, రతిక కెరీర్ లకు ఈ షో ఎంతో డ్యామేజ్ చేసింది.తమన్నా సింహాద్రి లాంటి వ్యక్తులు ఈ షో వల్ల పరువు పోగొట్టుకున్నారు.

బిగ్ బాస్ షో సీజన్ 7 లో అమర్ దీప్( Amardeep ) టార్గెట్ గా ఊహించని స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి.

అమర్ దీప్ తల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంటూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తూ మానసికంగా చంపుతున్నారంటూ అమర్ దీప్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.నేను అమర్ దీప్ తల్లినని( Amardeep Mother ) మీకు ఏమైనా మతి ఉండే అలాంటి కామెంట్లు పెడుతున్నారా అంటూ ఆమె కామెంట్లు చేశారు.

కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని ఆమె అన్నారు.

పల్లవి ప్రశాంత్( Pallavi Prasanth ) ఏమైనా దిగివచ్చాడా అంటూ అమర్ దీప్ తల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రశాంత్ దగ్గరకు అమర్ దీప్ భార్య, తల్లిని పంపిస్తానంటూ కామెంట్లు చేస్తారా? మీవి నీచమైన బ్రతుకులు అని ఆమె అన్నారు.తల్లి, భార్య జోలికి వస్తే ఇంటికి వచ్చి కొడతానని అమర్ దీప్ తల్లి పేర్కొన్నారు.

మీ మాటల వల్ల ఎంతో బాధ పడుతున్నామని మానసికంగా చంపేస్తున్నారని ఆమె తెలిపారు.

నాగార్జున( Nagarjuna ) దగ్గరకు వెళ్లి ఇదే విషయం మాట్లాడతానని ఏమనుకుంటున్నారో జాగ్రత్త అంటూ అమర్ దీప్ తల్లి చెప్పుకొచ్చారు.అమర్ దీప్ తల్లి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పల్లవి ప్రశాంత్ పీఆర్ టీం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని కొంతమంది చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube