ఏపీలో బీజేపీ( BJP ) పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeshwari ) అన్నారు.పొత్తుల్లో భాగంగా పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
పార్టీతో పాటు కూటమి అభ్యర్థులనూ గెలిపించాలని తెలిపారు.రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ( NDA alliance )అధికారంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.
ఏపీకి కేంద్రం 23 లక్షలు ఇస్తే మూడు లక్షలు మాత్రమే పూర్తి చేశారన్నారు.ఈ నేపథ్యంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.