సాంకేతికత అనేది అసాధ్యం అనిపించే వాటిని సుసాధ్యం చేస్తుంది.తాజాగా కెనడా( Canada )లో ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కనిపించింది.
కెనడాలోని నోవా స్కోటియాలోని హాలిఫాక్స్‌లోని ఒకప్పటి హోటల్ పూర్తిగా పునాదులతో సహా తరలించబడింది.మరో చోటికి దీనిని చాలా సులువుగా తీసుకెళ్లారు.
అయితే ఇలా చేసేందుకు వారు ఏం ఉపయోగించారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఇందుకోసం 700 బార్ల సబ్బును ఉపయోగించారు.
వాస్తవానికి ఈ హోటల్‌ను కూల్చివేయాల్సి ఉంది.కానీ ఒక ఉపాయంతో దాదాపు 200ల ఏళ్ల నాటి ఈ చారిత్రక హోటల్ కూల్చివేయకుండా రక్షించారు.
దీనిని మరో కొత్త ప్రదేశానికి సురక్షితంగా తరలించారు.
ఈ భవనం 1826లో నిర్మించబడింది.తరువాత విక్టోరియన్ ఎల్మ్‌వుడ్ హోటల్( Victorian Elmwood Hotel )గా మార్చబడింది.అయితే 2018లో కూల్చివేత ఉత్తర్వు జారీ చేయబడింది.
అటువంటి పరిస్థితిలో గెలాక్సీ ప్రాపర్టీస్( Galaxy properties ) అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సరికొత్తగా ఆలోచించింది.ఆ చారిత్రాత్మక హోటల్‌ను కొత్త ప్రదేశానికి తరలించడానికి ప్రణాళికతో దానిని కొనుగోలు చేసింది.
అలాగే దీని బాధ్యతను ఎస్.రష్టన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు.ఈ సంస్థ భవనాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడంలో విజయవంతంగా ఎన్నో సందర్భాల్లో పని చేసింది.అయితే, 220 టన్నుల హోటల్‌ను మార్చడం చాలా సవాలు అని చెప్పాలి.
అందులోనూ పాత భవనం కావడంతో దీనిని సురక్షితంగా తరలించడం చాలా కష్టసాధ్యంతో కూడిన పని.కానీ రష్టన్ కంపెనీ దీనిని చాలా సులువుగా పూర్తి చేసింది.సాంప్రదాయ రోలర్‌లను ఉపయోగించకుండా, 700 ఐవరీ సబ్బుతో తయారు చేసిన ప్రత్యేకమైన సొల్యూషన్ బార్‌ను ఉపయోగించాలని కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు.మృదువైన సబ్బు కడ్డీలు భవనాన్ని రెండు ఎక్స్‌కవేటర్లు, టో ట్రక్కుతో లాగడం ద్వారా దానిని తరలించడం సులభతరం అయింది.
ఐవరీ సోప్ మెత్తదనం కారణంగా ఎల్మ్‌వుడ్ సులభంగా 30 అడుగుల వరకు లాగబడిందని నిర్మాణ సంస్థ యజమాని షెల్డన్ రష్టన్ నివేదించారు.