స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అయినా లాక్‌డౌన్‌ను పూర్తిగా వినియోగించుకుంది ఈ చిత్ర యూనిట్.బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈ పోస్టర్‌ను బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.మాస్ లుక్‌లో బన్నీ అదరగొట్టడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
కాగా ఈ సినిమా కథకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో బన్నీ భార్యగా నటిస్తున్న రష్మిక మందన్న ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుందట.
అయితే ఆమెను కొందరు దుండగులు చంపేస్తారు.దీంతో వారిపై పగ తీర్చుకునేందుకు బన్నీ లారీ డ్రైవర్ అవతారమెత్తుతాడని, ఇందులో భాగంగానే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడతాడని తెలుస్తోంది.
పూర్తి మాస్ యాక్షన్‌తో కూడుకున్న సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్.బన్నీ మాస్ లుక్, పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే మేజర్ అసెట్ కానున్నట్లు తెలుస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తు్న్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy