ఇది వరకుతో పోల్చితే ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు కాస్త లైమ్ లైట్ లోకి రావడానికి ఇష్టపడుతున్నారు.సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వారు ప్రతి నిత్యం ఫాలోవర్స్ కు చేరువలో ఉంటున్నారు.
మరి అందులో అల్లు అర్జున్ భార్య స్నేహ ముందు వరుసలో ఉంటుంది.ఈమె ప్రతీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.
అల్లు స్నేహాకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువుగానే ఉంటారు.తమ లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ ను స్నేహ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్లతో పంచుకుంటుంది.
టాలీవుడ్ లో కొత్త స్టైల్ తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండే హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.ఈయన ప్రేక్షకుల చేత స్టైలిష్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.
ఇక ఈ స్టైలిష్ స్టార్ భార్య కూడా ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాషన్ ఫాలో అవుతుంది.ఇక తాజాగా స్నేహ రెడ్డి షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమె ఇటీవల కాలంలో మరింత మోడ్రన్ గా కనిపిస్తూ స్టార్ హీరోయిన్లకు సైతం ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్ తో ఆకర్షిస్తుంది.ఇక తాజాగా డిజైనర్ శారీలో స్నేహ బాపు బొమ్మలా.
బుట్టబొమ్మలా ఉంది అంటూ నెటిజెన్స్ చేత కామెంట్స్ అందుకుంటుంది.
ఆకుపచ్చ చీరలో డిజైనర్ బ్లౌజ్ తో స్నేహ నెటిజెన్స్ మనసు దోచుకుంటుంది.దీంతో అల్లు ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోను వైరల్ చేసేస్తున్నారు.ఇక అల్లు అర్జున్, స్నేహ పెళ్లి చేసుకుని 11 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా ఉంటూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు.
ఇక వీరికి అయాన్, అర్హ ఇద్దరు క్యూట్ బేబీస్ కూడా ఉన్నారు.