టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నారు బన్నీ.అంతేకాకుండా ఈ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సాధించని ఘనతను సాధించారు అల్లు అర్జున్.

ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి కూడా మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ సినిమాల ద్వారా సంపాదిస్తుండగా స్నేహ రెడ్డి బిజినెస్ ల ద్వారా బాగానే సంపాదిస్తోంది.
ఇప్పటికే బిజినెస్లను ప్రారంభించిన స్నేహ రెడ్డి వాటిని మరింత విస్తరించే పనిలో ఉంది.అల్లు స్నేహా( Allu Sneha ) స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్( Firefly Carnival ) జనవరి 20న ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది.

ఇందుకు సంబంధించిన పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు.ఈ కార్నివాల్‌లో షాపింగ్ ఎంజాయ్‌మెంట్ యాక్టివిటీస్, రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు.ఈ ఈవెంట్ జనవరి 20న హైదరాబాద్‌లోని మాదాపూర్ లో ఉదయం 10 గంటలకు మొదలవుతుంది.అయితే ఈ కార్నివాల్ ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అల్లు స్నేహ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్నేహారెడ్డి మరింత సక్సెస్ అవ్వాలి వ్యాపారం మరింత పెరగాలి అని అభిమానులు కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.







