అల్లు వారి బాబు భారీ ఆశలు, ఈసారైనా వర్కౌట్ అయ్యేనా

మెగా హీరో అల్లు శిరీష్ త్వరలో ఊర్వశివో రాక్షసివో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ విడుదల అయింది.

టీజర్ లో సన్నివేశాలు చూస్తూ ఉంటే ఇది ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది అనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అల్లు శిరీష్ కి వెంటనే ఒక సక్సెస్ కావాలి, ఆ సక్సెస్ ని ఈ సినిమా ఇస్తుందేమో అంటూ చాలా మంది చాలా రకాలుగా నమ్మకం తో ఉన్నారు.

ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తి అయ్యింది. రాకేష్ శశి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కు మొదట ప్రేమ కాదంటా అనే టైటిల్ ని నిర్ణయించారు.

ఆ టైటిల్ తో పోస్టర్ కూడా అధికారికం గా విడుదల చేయడం జరిగింది.

Advertisement

ఆ సమయం లో రకరకాలుగా ప్రచారం జరిగింది.సినిమా విడుదల వాయిదా పడి చాలా ఆలస్యం అవ్వడం తో ఇప్పుడు ఫ్రెష్ గా ఉండాలనే ఉద్దేశం తో ఊర్వశివో రాక్షసివో అనే టైటిల్ తో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అల్లు శిరీష్ సక్సెస్ అవ్వలేక పోతున్నాడు.

ఒక వైపు అన్నయ్య అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకు వెళ్తుంటే మరో వైపు తమ్ముడు అల్లు శిరీష్ ఇలా చిన్నచిన్న సినిమాలతో ఇంకా సక్సెస్ కోసం ప్రాకులాడుతున్న పరిస్థితిని చూడవచ్చు.సినిమా కోసం చాలా కష్టపడే అల్లు శిరీష్ ఈ సినిమాకు కూడా ఖచ్చితంగా కాస్త ఎక్కువగానే కష్టపడి ఉంటాడు.

మరి ఈసారైనా అల్లు శిరీష్ కి ఈ సినిమాతో సక్సెస్ దక్కుతుందా లేదా అనేది ఈ వారంలో సినిమా విడుదలైతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు