అల్లు అరవింద్ వ్యూహం ఫలించిందా... అనుకున్న టార్గెట్ చేరుకున్నారా?

సాధారణంగా బుల్లితెరపై ఇప్పటికి మనకు ఎన్నో టాక్ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేశాయి.ఎంతోమంది పెద్ద ఎత్తున టాక్ షోలను నిర్వహిస్తూ ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని ప్రశ్నించారు.

 Allu Arvindh Plan Is Succed Know Details Inside Allu Arvind, Aha App, Balayya, C-TeluguStop.com

అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ద్వారా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.అయితే ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి బాలకృష్ణను వ్యాఖ్యాతగా పరిచయం చేశారు.

ఈ కార్యక్రమానికి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో బాలయ్య ఏంటి వ్యాఖ్యాత ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

ఈ విషయంలో అల్లు అరవింద్ లెక్కలు వేరే ఉన్నాయని ఆ తర్వాత అందరికీ అర్థమయింది.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ షో కూడా హిట్ కాని విధంగా ఈ షోని బాలయ్య సూపర్ డూపర్ హిట్ చేశారు.ఇక ఈ షో మంచి విజయం సాధించడంతో అన్ స్టాపబుల్ కార్యక్రమం రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.

ఇక ఈ సీజన్ మొదటి సీజన్ కు మించి ఉండేలా అల్లు అరవింద్ వ్యూహం రచించారు.సాధారణంగా ఇలాంటి టాక్ షోలకు కేవలం సినిమా సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానిస్తారు.

కానీ అల్లు అరవింద్ మాత్రం ఏకంగా రాజకీయ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు.

Telugu Aha App, Allu Arvind, Balakrishna, Balayya, Chandrababu-Movie

అన్ స్టాపబుల్ సీజన్ 2 కార్యక్రమానికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ను రంగంలోకి దింపారు.ఇలా మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు రాబోతున్నారని తెలియగానే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో మరిన్ని అంచనాలను చేరుకుంది.

ప్రోమో ద్వారానే ఈ కార్యక్రమానికి భారీ హైప్ తీసుకువచ్చిన అల్లు అరవింద్ ఇక ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.శుక్రవారం ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్రేక్షకులు వీక్షించారని తెలుస్తోంది.

కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు చూపు కూడా ఈ కార్యక్రమం పై పడేలా అల్లు అరవింద్ తన వ్యూహాన్ని రచించారు.మొత్తానికి ఈ కార్యక్రమంతో అల్లు అరవింద్ తను అనుకున్న టార్గెట్ చేరుకున్నారా అనే విషయానికి వస్తే అంతకుమించి టార్గెట్ రీచ్ అయ్యారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube