Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిలో ఈ టాలెంట్ కూడా ఉందా.. మల్టీ టాలెంటెడ్ అంటూ?

అల్లు స్నేహారెడ్డి( Allu Sneha Reddy ) పరిచయం అవసరం లేని పేరు నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సతీమణిగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే.నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉండగా స్నేహ రెడ్డి మాత్రం తన పిల్లల వ్యవహారాలన్నింటిని చక్కగా పెడుతూ తల్లిగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

 Allu Arjun Wife Allu Sneha Reddy Singing Talent News Viral-TeluguStop.com

అల్లు స్నేహారెడ్డి ఇండస్ట్రీకి ఏమాత్రం పరిచయం లేని అమ్మాయి.అల్లు అర్జున్ తనని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ జీవితంలో ముందుకు వెళ్తున్నారు.ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ సినిమాల పరంగా బిజీగా ఉండగా స్నేహ రెడ్డి మాత్రం మోడలింగ్ ( Modelling ) రంగం వైపు అడుగులు వేశారు.ఈమె తరచు సోషల్ మీడియాలో విభిన్నమైనటువంటి దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ఫోటోషూట్స్ నిర్వహిస్తూ ఉంటారు.

ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Telugu Allu Arjun, Allusneha, Tollywood-Movie

ఇలా ఎప్పటికప్పుడు స్టైలిష్ ట్రెండ్ ఫాలో అవుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.ఇక ఈమె తన విషయాలు మాత్రమే కాకుండా ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.ఇలా ఇన్ని రోజులపాటు ఇంటికే పరిమితమైనటువంటి ఈమె ఇటీవల ఓ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Allu Arjun, Allusneha, Tollywood-Movie

ఈ వాణిజ్య ప్రకటనలో కూడా అల్లు స్నేహారెడ్డి ఎంతో నేచురల్ గా అద్భుతంగా నటించడంతో ఈమెలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా ఇండస్ట్రీలోకి వస్తే హీరోయిన్గా పక్క సక్సెస్ అవుతారు అంటూ పలువురు భావించారు.అయితే అల్లు స్నేహారెడ్డిలో మరో హిడెన్ టాలెంట్( Hidden Talent ) కూడా ఉంది అంటూ తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది.ఈమెకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమట ఈమె బేసిక్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారని అంతేకాకుండా పాటలు( Singing ) కూడా చాలా అద్భుతంగా పాడుతారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

Telugu Allu Arjun, Allusneha, Tollywood-Movie

ఈమె బయట ఎక్కడ పాటలు పాడకపోయినా ఫ్యామిలీ అకేషన్స్ లో మాత్రం తన గొంతు వినిపిస్తూ ఉంటారని పాటలు చాలా చక్కగా పాడుతుంది అంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో అల్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్నేహ రెడ్డిలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా ఈమె మల్టీ టాలెంటెడ్ అంటూ ఈమెపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.ప్రస్తుతం స్నేహ రెడ్డికి సంబంధించిన ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube