ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా కొనసాగుతోంది.పాన్ ఇండియా డైరెక్టర్లుగా గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకులు మాత్రమే రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
రాజమౌళి సుకుమార్ ప్రశాంత్ నీల్ ప్రశాంత్ వర్మ మరికొందరు దర్శకులు ఈ జాబితాలో ఉన్నారు.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) తర్వాత సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకోవాలని భావిస్తున్నారు.
స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత సినిమా గుంటూరు కారం సినిమాకు యావరేజ్ టాక్ రాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
అయితే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ శ్రీనివాస్ మైథలాజికల్ టచ్ ఉన్న ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా బడ్జెట్ 700 కోట్ల రూపాయలకంటే ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది.

థియేటర్లలో ఈ సినిమా విడుదల కావాలంటే 2027 వరకు ఆగాల్సిందే నని తెలుస్తోంది.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మూడేళ్లకు ఒక సినిమాను తెరకెక్కించే దర్శకుల జాబితాలో చేరినట్టేనని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ ఏడాదే ఈ సినిమా మొదలుకానుండగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించేది ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఆ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.అల్లు అర్జున్ పారితోషికం 150 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.బన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం టాప్ లో ఉన్నారు.







