అల్లు అర్జున్‌ చాలా మందిని లైన్‌లో ఉంచాడు, ముందు ఎవరితోనో?

నా పేరు సూర్య చిత్రం తర్వాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో చిత్రంతో వచ్చి గ్యాప్‌ ఫిల్‌ చేసేలా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్నాడు.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల వైకుంఠపురంలో చిత్రం తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయవద్దని బన్నీ అనుకున్నాడు.

 Surender Reddy Narrate The Story About Race Gurram Movie Sequel With Allu Arjun-TeluguStop.com

కాని కరోనా ఆయన ప్లాన్స్‌ను రివర్స్‌ చేసింది.కరోనా అనేది లేకుండా, రాకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే సుకుమార్‌ సినిమా సగానికి పైగా పూర్తి అయ్యేది, దసరా లేదా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది.

సుకుమార్‌ మూవీ తర్వాత ఐకాన్‌ సినిమాను బన్నీ చేయబోతున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు ఆమద్య జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి.కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఒక్క అడుగు పడలేదని అంటున్నారు.ఐకాన్‌ సినిమా మాత్రమే కాకుండా బన్నీ మరో నాలుగు సినిమాలను కూడా లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది.

సురేందర్‌ రెడ్డి ఇటీవలే ఒక స్క్రిప్ట్‌ను బన్నీకి వినిపించాడట.ఆ సినిమా రేసు గుర్రం సినిమాకు సీక్వెల్‌ అన్నట్లుగా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

Telugu Allu Arjun, Allu Arjun Icon, Pushpa, Race Gurram, Sukumar, Surender Reddy

ఈ సినిమాలే కాకుండా బన్నీకి విక్రమ్‌ కుమార్‌, మారుతి మరో ఇద్దరు కూడా కథలు చెప్పారు.వాటికి కూడా బన్నీ ఓకే చెప్పాడు.ఆ సినిమాలు కూడా చేయాలని బన్నీ చాలా ఆసక్తిగా ఉన్నాడు.అయితే సుకుమార్‌ సినిమా తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రాలేదు.

ఐకాన్‌ సినిమా గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నా కూడా పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.ఏది మొదట ఉంటుందనేది పుష్ప చిత్రం విడుదల సమయానికి తెలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube