పుష్ప 2 హిందీ డబ్బింగ్ రైట్స్‌.. బాహుబలిని మించేనా?

అల్లు అర్జున్‌ హీరోగా రూపొందిన పుష్ప సినిమా( Pushpa movie ) ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రికార్డు స్థాయి లో హిందీ లో పుష్ప సినిమా వసూళ్లు దక్కించుకుంది.

 Allu Arjun Sukumar Pushpa 2 Movie Hindi Pre Release Business ,pushpa 2, Hindi-TeluguStop.com

ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన పుష్ప సినిమా కు అక్కడ ప్రేక్షకులు ఏకంగా వంద కోట్ల వసూళ్లు కట్టబెట్టారు.అయిదు కాదు, పది కాదు ఏకంగా 50 రోజుల పాటు సినిమా ఆడింది.

పుష్ప సినిమా కి జాతీయ అవార్డు ను కూడా బన్నీ అందుకున్నాడు.

Telugu Allu Arjun, Hindi Pre, Mythri Makers, Pushpa, Sukumar, Tollywood-Movie

దాంతో పుష్ప 2 యొక్క అంచనాలు పదుల రెట్లు పెరిగాయి.దాంతో పాటు ఇప్పుడు బాలీవుడ్ లో పుష్ప 2 యొక్క మార్కెట్‌ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉందట.చాలా మంది బాలీవుడ్ లో బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్‌ ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందా అంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ రేంజ్ లో పుష్ప 2 సినిమా కు వస్తున్న ఆధరణ చూసి మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వారు కూడా నోరు వెళ్లబెడుతూ ఉంటారు.

Telugu Allu Arjun, Hindi Pre, Mythri Makers, Pushpa, Sukumar, Tollywood-Movie

ముందు ముందు పుష్ప 2 కి ఉత్తరాదిన మరింతగా క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.అప్పుడు మరింతగా క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పైగా సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా 9 నెలల సమయం ఉంది.

అందుకే ఇప్పటి నుంచే సినిమా యొక్క బిజినెస్ గురించి మాట్లాడటం లేదు.అయితే హిందీ నిర్మాతలు మాత్రం పుష్ప 2 సినిమా ను తమకంటే తమకు ఇవ్వాలంటూ మైత్రి వారి చుట్టూ తిరుగుతూ ఉన్నారట.

ధర్మ ప్రొడక్షన్స్ కి సంబంధించిన వారు కూడా పుష్ప 2 డబ్బింగ్‌ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.పుష్ప 2 యొక్క ఓవరాల్‌ పాన్ ఇండియా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.అందులో హిందీ షేర్‌ ఎంత ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube