షాకింగ్ పోస్ట్ చేసిన బన్నీ ..వెంటనే డిలీట్ మళ్లీ పోస్ట్.. ఎందుకంత టెన్షన్?

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైనటువంటి మెగా హీరోలు అలాగే అల్లు అర్జున్( Allu Arjun ) మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇలా ఈ వివాదాల గురించి ఈ ఇద్దరు హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున యుద్ధానికి దిగారు.

ఒక హీరో గురించి మరో హీరోల అభిమానులు విమర్శలు చేస్తూ ఏకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్లకార్డులతో దర్శనం ఇవ్వడం వంటివి కూడా చేశారు.ఇలా అభిమానుల మధ్య ఉన్నటువంటి ఈ వివాదం ఏకంగా హీరో వరకు వచ్చి చేరింది.

Allu Arjun Shares Post Goes To Controversy Details, Allu Arjun, Pushpa 2, Allu A

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా విడుదల కాబోతుంది డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించడమే కాకుండా అక్కడ స్పెషల్ సాంగ్ కూడా లాంచ్ చేశారు.ఇక ఈ వేడుకలో కూడా కొంతమంది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) యాంటీ ఫ్యాన్స్ పవన్ కించపరిచే విధంగా ఫ్లకార్డులతో దర్శనమిచ్చారు.

అయితే అభిమానులు ఇలా చేస్తున్నారు అంటే బన్నీ టీం ప్రోత్సాహంతోనే చేస్తున్నారనే వాదన కూడా ఉంది.

Allu Arjun Shares Post Goes To Controversy Details, Allu Arjun, Pushpa 2, Allu A
Advertisement
Allu Arjun Shares Post Goes To Controversy Details, Allu Arjun, Pushpa 2, Allu A

ఇకపోతే ఈ ఈవెంట్ కి సంబంధించిన ఒక పోస్ట్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.అయితే ఈయన షేర్ చేసిన  ఆ ఫోటోని డిలీట్ చేసి తిరిగి మరి అదే ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త చర్చలకు కారణమైంది.తాను శ్రీలీల( Sreeleela ) కలిసి ఉన్న పిక్ లో దూరంగా బ్లర్ గా ఓ అభిమాని ఫ్లెక్స్ పట్టుకొని కనిపిస్తాడు.

ఇందులో ఏం పీకలేరు బ్రదర్ PK అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ట్యాగ్ ఉంది.ఈ పోస్ట్ చేసిన అల్లు అర్జున్ వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసి తిరిగి అదే పోస్టును కాస్త క్రాప్ చేసి షేర్ చేశారు.

దీనితో ముందే పెట్టిన ఆ పోస్ట్ కాంట్రవర్సీకి దారి తీసింది.అల్లు అర్జున్ తెలిసి పెట్టాడో తెలీక పెట్టాడో కానీ ఇది మాత్రం డైరెక్ట్ హీరో నుంచే ఇలాంటి పోస్ట్ రావడంతో మరోసారి వీరి అభిమానుల మధ్య వార్ మొదలైంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు