కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేయనున్న అల్లు అర్జున్ రష్మిక.. పుష్ప ఎఫెక్ట్ మామూలుగా లేదు!

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లుఅర్జున్ రష్మిక గురించి అందరికీ తెలిసిందే.

పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్, పల్లెటూరి యువతి పాత్రలో రష్మిక ఎంతో అద్భుతమైన నటనను కనబరిచి విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు.ఇక ఈ సినిమా ద్వారా కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఎంతో మంచి ఆదరణ లభించింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం కావడంతో పుష్ప పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు కలిగాయి.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభం కానున్నాయి.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రష్మిక బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun Rashmika On The Coffee With Karan Show Pushpa Movie Effects Are Next
Advertisement
Allu Arjun Rashmika On The Coffee With Karan Show Pushpa Movie Effects Are Next

ఈ క్రమంలోనే వీరిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరై ఎన్నో విషయాలను ముచ్చటించనున్నారు.ప్రస్తుతం ఈ షో ఏడవ సీజన్ ప్రారంభం కాబోతోంది.అయితే ఈ షో టెలివిజన్లో కాకుండా ఓటిటిలో ప్రసారం చేస్తున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు.

ఇలా ఎంతో మంది సెలబ్రిటీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారితో సరదాగా ముచ్చటిస్తూ వారి వ్యక్తిగత విషయాలను అభిమానులతో కలిసి పంచుకుంటారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అతిథులుగా అల్లు అర్జున్, రష్మికను ఆహ్వానించగా, వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు