బన్నీ ఆఫర్‌కు భయపడుతున్న డైరెక్టర్.. ఎవరో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించాడు బన్నీ.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ మూవీగా ‘పుష్ప’ను తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడు.

Maruthi Afraid Of Allu Arjun Offer, Allu Arjun, Pushpa, Sukumar, Maruthi, Aha, T

అయితే గతంలోనే బన్నీతో సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చిన చిన్న చిత్రాల దర్శకుడు మారుతి, ఆ వైపు అడుగులు మాత్రం వేయలేకపోయాడు.ఇటీవల సాయి ధరమ్ తేజ్‌కు ప్రతిరోజూ పండగే చిత్రాన్ని అందించిన ఈ డైరెక్టర్, బన్నీతో సినిమా చేయాలని చాలా ఆశపడుతున్నాడు.

ఇక బన్నీ కూడా మారుతితో సినిమాకు పచ్చ జెండా ఊపినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.అయితే మారుతి మాత్రం ఇప్పటివరకు బన్నీకి కథను వినిపించలేకపోయాడు.

Advertisement

దీనికి తనదైన కారణం కూడా ఉందని చెబుతున్నాడు.ఇటీవల ‘ఆహా’ ఓటీటీలో ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయాల్సిందిగా అల్లు అరవింద్ కోరడంతో మారుతి ఓకే అన్నాడు.

అటు బన్నీ పుష్ప చిత్రంతో పాటు తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.ఈ క్రమంలో ఆయనకు తాను కథ ఎప్పుడు రెడీ చేయాలి, ఎప్పుడు వినిపించాలి అనే డైలమాలో పడ్డాడట మారుతి.

అందుకే బన్నీకి కథ వినిపించాలంటేనే మారుతి వణికిపోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మారుతి నోరు విప్పాల్సిందే.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు