Pushpa 2: ఇండియన్ సినిమాలలో రికార్డు స్థాయిలో పుష్ప 2 ఆడియో రైట్స్.. ఎన్ని రూ. కోట్లో తెలుసా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) కాగా ఇప్పటికే పుష్ప 1 సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Allu Arjun Pushpa 2 The Rule Audio Rights Sold For Record Price-TeluguStop.com

ఇక పుష్ప 1 కి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే.ఇప్పటికే పార్ట్ 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇకపోతే గత నెల ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్( Allu Arjun ) పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 సినిమా నుంచి ఒక టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

Telugu Allu Arjun, Bhushan Kumar, Sukumar, Pushpa, Tollywood-Movie

కాగా ఈ టీజర్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది.సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే ఈ సినిమాపై ఇప్పటికే సాలిడ్ బజ్ ను క్రియేట్ చేసింది.దాంతో డైరెక్టర్ సుకుమార్( Sukumar ) పుష్ప 2 సినిమాని కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ తో అంతకి మించిన కథతో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకా షూటింగ్ చాలా జరగాల్సి ఉంది.

కానీ అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన పుష్ప 2 బిజినెస్ మొదలైనట్లు తెలుస్తోంది.ఈ మేరకు తాజాగా అందిన సమాచారం ప్రకారం.పుష్ప 2 ఆడియో హక్కులని టి సిరీస్ సంస్థ ఏకంగా రూ.65 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Bhushan Kumar, Sukumar, Pushpa, Tollywood-Movie

కాగా ఇది ఇండియన్ సినిమాలోనే ఇది కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్ర అని చెప్పవచ్చు.పుష్ప రాజ్ రికార్డుల వేట ప్రారంభించాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఆడియో హక్కుల విషయంలో పుష్ప 2 ఇండియన్ సినిమాలోనే టాప్ లో నిలిచింది.ఆర్ఆర్ఆర్ 26 కోట్లు, పొన్నియిన్ సెల్వన్ 24 కోట్లు, సాహో 22 కోట్లు , లియో 16 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ముంబైలో పుష్ప నిర్మాతలతో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.ఈ 65 కోట్లు కేవలం ఆడియో వరకే పరిమితమా లేక టి సిరీస్ కి అదనంగా వేరే ఏమైనా రైట్స్ కూడా దక్కుతాయా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube