టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa Movie ) తో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.
ఇలా పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.ఇక ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా పుష్ప సినిమాతో తన నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.
ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు సొంతం చేసుకున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ కావడంతో దుబాయ్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో( Madam Tussauds ) ఏకంగా ఈయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గతంలో దుబాయ్ వెళ్లినటువంటి అల్లు అర్జున్ తన కొలతలు అన్నింటిని ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే అల్లు అర్జున్ చేతుల మీదుగా మార్చి 28వ తేదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కూడా దుబాయ్ వెళ్లారు.ఇక అల్లు అర్జున్ స్టాచ్యూ దగ్గర అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఫోటోలు దిగారు.ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలను అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి ( Sneha Reddy ) అల్లు అర్జున్ తో పాటు ఆయన స్టాట్యూ తో కలిసి సెల్ఫీ దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసిన అల్లు అర్జున్ క్యూటీ ఇద్దరు అల్లు అర్జున్ లను హ్యాండిల్ చేయగలవా అంటూ సరదాగా కామెంట్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ విధంగా అల్లు అర్జున్ స్టాచ్యూ ఆవిష్కరణ జరగడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక ఈ విగ్రహం పక్కన అల్లు అర్జున్ నిలబడితే అందులో రియల్ ఎవరు అని కనుక్కోవడం కూడా కాస్త కష్టతరంగా ఉండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం.