సమంత, దేవ్ మోహన్( Samantha, Dev Mohan ) జంటగా గుణశేఖర్( Gunasekhar) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం శాకుంతలం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది .
ఇక ఇందులో అల్లు అర్జున్ ( Allu Arjun ) కూతురు అర్హ( Allu arha ) కూడా ప్రత్యేక పాత్రలో నటించింది .ఈ సినిమా చూస్తున్నంత సేపు మహాభారతంలోని ఆది పర్వంలోకి వెళ్లి.శకుంతలా దుష్యంతుల ప్రేమ గాధను, బాధను కళ్ళ ముందు చూస్తున్న బావన కలుగుతుందని ఆడియెన్స్ అంటున్నారు .ముఖ్యంగా 3డి విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయని అలాగే ప్రేక్షకులకు ఆ అడవి ప్రాంతంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.
ఇక సినిమా ఎలా ఉన్నా .నటీనటుల పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి .ఇక ఈ సినిమాలో దుష్యంతుడు, శకుంతల కుమారుడు భరతుడి చిన్ననాటి పాత్రలో అర్హ నటించింది.శుక్రవారం శాకుంతలం సినిమా రిలీజైంది.
అందులో భరతుడిగా నటించిన అర్హ నటనను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శాకుంతలం టీమ్‌కు విషెష్ చెబుతూ, తన కుమార్తె అర్హ ఎంట్రీ గురించి స్పందించారు.
శాకుంతలం టీమ్‌కు అభినందనలు.ఇలాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన గుణ శేఖర్‌గారు, నీలిమ గుణగారు, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కి శుభాకాంక్షలు.
స్వీటెస్ట్ లేడీ సమంత, మల్లు బ్రదర్ దేవ్ మోహన్‌కి కంగ్రాట్స్.
మీ అందరికీ చిన్న అతిథి పాత్ర చేసిన అల్లు అర్హ నచ్చే ఉంటుంది.తను ఎంతో బాగా చూసుకుని వెండితెరకు పరిచయం చేసిన గుణ గారికి ధన్యవాదాలు.ఈ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’ అన్నారు.
గుణ శేఖర్‌ను అల్లు అర్జున్ బాగా అభిమానిస్తారు.అందుకనే ఆయన డైరెక్షన్‌లో ఇంతకు ముందు వచ్చిన రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ కనిపించారు.
ఇప్పుడు బన్నీ కుమార్తె అల్లు అర్హను సైతం గుణ శేఖర్ దర్శకత్వంలోనే ఇంట్రడ్యూస్ చేశారు.
శాకుంతలం మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది.ఇక పౌరాణిక ప్రేమ జంట ‘శకుంతలా దుష్యంతుల’ ప్రేమ కథకు 3డి ఎఫెక్ట్ అద్ది.బ్యూటిఫుల్ విజువల్స్ తో దర్శకుడు గుణశేఖర్ ఈ శాకుంతలం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
అయితే, గుణశేఖర్ విజువల్స్ మరియు టేకింగ్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్, కథకథనాల పై పెట్టలేదు.రొటీన్ ప్లే అండ్ బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ లవ్ డ్రామా వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయని అంటున్నారు .