సాధారణంగా సినిమాలలో హీరోలు చేసే కొన్ని క్యారెక్టర్ లను బుల్లితెర ఆర్టిస్టులు కూడా చేస్తూ వారిని ఇమిటేట్ చేస్తుంటారు.అయితే కొన్నిసార్లు ఇవి నవ్వు తెప్పించిన మరికొన్నిసార్లు మాత్రం అభిమానులకు తెగ కోపాన్ని తెప్పిస్తూ ఉంటాయి.
ఇలా తాజాగా ముక్కు అవినాష్(Mukku Avinash) వ్యవహారి శైలి పై బన్నీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇలా బన్నీ అభిమానులకు కోపం తెప్పించేలా ముక్కు అవినాష్ ఏం చేశారు ఎందుకు బన్ని ఫాన్స్ ఇంతలా ఫైర్ అవుతున్నారు అనే విషయానికి వస్తే.
తాజాగా అల్లు అర్జున్(Allu Arjun) పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఆయన నటిస్తున్న పుష్ప 2 సినిమా(Pushpa 2 Movie) నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పాలి.ఇలా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోని ముక్కు అవినాష్ తనదైన శైలిలో అరకొరక ఎడిటింగ్ చూసి తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు.ఇలా ముక్కు అవినాష్ తన ఓన్ మేడ్ పిక్ తో అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో బన్నీ అభిమానులు ఒక్కసారిగా మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటో పై బన్ని ఫాన్స్ రియాక్ట్ అవుతూ అల్లు అర్జున్ ఈ లుక్ లో ఉంటే గంగమ్మ తల్లిలా ఉంది కానీ నువ్వు ఈ లుక్ లో ఉంటే పక్కింటి మంగమ్మాలా ఉన్నావు ముందు ఈ ఫోటో డిలీట్ చెయ్… రేయ్ అవినాష్ ఫాన్స్ ను ఇరిటేట్ చేయకు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ ఫోటోని నువ్వు అర్జెంటుగా డిలీట్ చేయకపోతే నీకు పగులుద్ది అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.ఇలా బన్నీ ఫాన్స్ రియాక్షన్ కి అవినాష్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.