అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డు.. 5 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా ‘పుష్ప’ ఆల్బమ్..

పుష్ప సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది.ఈ చిత్రంపై ముందు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది.

 Allu Arjun Creates Another Record With Pushpa Album Details, Allu Arjun , Pushpa-TeluguStop.com

ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించింది పుష్ప.ఇప్పటికే పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి.పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది.

అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట.ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచిన పుష్ప ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది.దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఊఊ అంటావా పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది.

అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ఏం చెప్పాలి.? పుష్ప సినిమాలోని ప్రతీ విషయం కూడా ప్రేక్షకులకు అడిక్షన్‌లా మారిపోయింది.ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది పుష్ప మ్యూజిక్ ఆల్బమ్.దీనికి ముందు అల వైకుంఠపురములో సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది.

పుష్ప అదే కంటిన్యూ చేసింది.పుష్ప తనకు మైల్ స్టోన్ మూవీ అవుతుందని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఐకాన్ అల్లు అర్జున్.

అలా ఆయన చెప్పిన ప్రతీ అంచనా నిజమైపోతుందిప్పుడు.ఈ మధ్యే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి పంపిన మెసేజ్ వైరల్ అయ్యింది.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Views, Pushpa Album, Pushpa, Rashmika, Sukum

దర్శకుడు సుకుమార్‌ను పొగుడుతూ.పుష్ప సినిమాను ఆయన వర్ణించిన తీరు అద్భుతం.ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ను ఆకాశానికి ఎత్తేసారు రాజ్ కుమార్ హిరాణి.ఈ విషయాన్ని కూడా బన్నీ ముందుగానే అంచనా వేసారు.సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు బన్నీ.

కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు.ఆయన చెప్పినట్లుగానే పుష్ప ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది.

నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప తరహాలో తగ్గేదే లే అన్నారు.ఇంకా అంటూనే ఉన్నారు.

అంతేకాదు రాజకీయ నాయకులు సైతం పుష్ప మేనరిజమ్స్ వాడుకుంటూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube