అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) షూటింగ్ కు గత రెండు నెలలుగా బ్రేక్ పడింది.మధ్య లో వారం షూటింగ్ జరిగినా కూడా బన్నీ లేకుండానే షూట్ జరిగిందట.
జాతీయ అవార్డును అందుకోవడానికి బన్నీ ఢిల్లీ వెళ్లడం తో పాటు కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లడం వల్ల కూడా షూటింగ్ కు హాజరు అవ్వలేదు.అందుకే సుకుమార్( Sukumar ) కూడా బ్రేక్ తీసుకున్నాడు.
ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ తో యూనిట్ సభ్యులు అంతా కూడా బిజీ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ నుంచి ఏకదాటిగా నెల రోజుల పాటు కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది.హీరోయిన్ గా రష్మిక మందన్నా ( Rashmika Mandanna )నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ షెడ్యూల్ లో ఈమె కనిపించడం లేదట.
అందుకే కచ్చితంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అయ్యి ఉంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా రూపొందించేందుకు గాను దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసిన వారిని రంగంలోకి దించుతున్నాడు.
బన్నీ కి పుష్ప పాత్రకు గాను జాతీయ అవార్డు వచ్చింది.అందుకే పుష్ప 2 సినిమా లో మరింత అద్భుతంగా నటించాలని బన్నీ తాపత్రయ పడుతున్నాడు.

అందుకే సుకుమార్ కూడా అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు.వచ్చే వారం లో ప్రారంభం కాబోతున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 movie ) యొక్క షెడ్యూల్ లో భారీ జాతర లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేస్తారని తెలుస్తోంది.అల్లు అర్జున్ హీరో గా పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ గా వసూళ్లు నమోదు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.అందుకే ఏకంగా రూ.500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయి అంటున్నారు.