పుష్ప మళ్లీ ఇదేం ట్విస్ట్‌... హిందీ లో రిలీజ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఇటీవలే చివరి పాట చిత్రీకరణ పూర్తి చేశారు.

సినిమాలో ఫాహద్ ఫాజిల్ సునీల్‌ అనసూయ వంటి స్టార్‌ నటీ నటులు నటించడంతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉన్న రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించింది.మొదటి నుండి ఈ సినిమాను అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చారు.

అయితే ఇటీవల హిందీ రిలీజ్ ను స్కిప్‌ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అందుకు సంబంధించిన వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో అల్లు అభిమానులు హిందీ వర్షన్‌ విడుదల అవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఉత్తరాదిన కూడా అల్లు అర్జున్‌ కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.వారు అల్లు అర్జున్‌ కోసం సినిమాను అక్కడ విడుదల చేయాలని సోషల్‌ మీడియా ద్వారా ఆందోళన మొదలు పెట్టారు.

Advertisement
Allu Arjun And Sukumar Movie Pushpa Hindi Release , Allu Arjun , Sukumar , Push

దాంతో మళ్లీ పుష్ప టీమ్ నిర్ణయం ను మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే ఇటీవల సునీల్‌ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలో హిందీ వర్షన్‌ లో విడుదల చేయలేదు.

Allu Arjun And Sukumar Movie Pushpa Hindi Release , Allu Arjun , Sukumar , Push

కాని అనసూయ దాక్షయని పాత్ర కు సంబంధించిన లుక్ ను రివీల్ చేసినప్పుడు మాత్రం క్లారిటీగా హిందీ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.దాంతో మళ్లీ పుష్ప హిందీ విడుదల ఉంటుంది అనే ప్రచారం మొదలు అయ్యింది.ఈ వ్యవహారంలో చిత్ర నిర్మాతల స్పందన ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన చాలా విషయాలను రివీల్ చేశారు కాని ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు వారు సిద్దంగా లేరు అన్నట్లుగా అనిపిస్తుంది.పుష్ప హిందీ రిలీజ్ ఉందా లేదా అనేది ఒకటి రెండు రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు