స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచి బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు బన్నీ.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పుష్ప అనే టైటిల్‌తో పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఈ క్రమంలో బన్నీ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే బన్నీకి కొరటాల ఓ స్టోరీలైన్ వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చిందని, త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాను కొరటాల తనదైన మార్క్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అటు మరో యంగ్ డైరెక్టర్ మహి వి రాఘవ కూడా బన్నీతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.త్వరలోనే బన్నీ కొరటాల శివల సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉండనుండటంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొరటాల ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.







