సినీ పరిశ్రమ లో పరిచయం అక్కరలేని పేరు అల్లు అరవింద్.ఒక ప్రొడ్యూసర్ గానే కాకుండా అల్లు రామలింగయ్య తనయుడి గా, మెగాస్టార్ చిరంజీవి బావమరిది గా కూడా ఆయనను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు.
అయితే ఆయన వారసత్వంగా ఆయన కుమారులు అల్లు అర్జున్,అల్లు శిరీష్ లు హీరో లుగా తమ ప్రాజెక్ట్స్ తాము చేసుకుంటూ పోతున్నారు.అయితే వారిద్దరే కాకుండా అల్లు అరవింద్ కు మరో కుమారుడు ఉన్నారు.
అతనే అల్లు వెంకట్, ఎప్పుడూ మీడియా ముందుకే రాని అల్లు వెంకట్ ను ఇండస్ట్రీ మొత్తం బాబీ అని పిలుస్తుంది.
బాబీ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు.
ప్రొడక్షన్ సైడ్ తండ్రికి చేదోడు వాదోడు గా ఉంటాడు.అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అంటే, అల్లు బాబీ తాజాగా పెళ్లి చేసుకున్నాడు.
అదేంటి పెద్ద కుమారుడు ఇప్పుడు పెళ్లి ఏంటి అని అనుకుంటున్నారా.గతంలో 2007 లో ఆయన తోలి వివాహం జరగగా,వారికి ఒక పాప కూడా ఉంది.
అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో విడాకులు తీసుకున్నారు.దీనితో అల్లు బాబీ తాజాగా ముంబై కి చెందిన యోగా స్థూడియో నిర్వాహకురాలు నీల షా ని వివాహం చేసుకున్నారు.

వారి పెళ్లి కి సంబందించిన ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.బాబీ వివాహం హైదరాబాద్ లోని ఐటిసి కోహినూర్ హోటల్లో ఘనంగా జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటుమెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా హాజరయ్యారు.అయితే ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఈ పెళ్లి వేడుకలో కనిపించకపోవడం విశేషం.
అల్లు బాబీ వివాహమాడిన నీల షా ముంబై కి చెందిన అమ్మాయి అయినప్పటికీ హైదరాబాద్ లో యోగా స్థూడియో నిర్వహిస్తూ ఇక్కడే సెటిల్ అయినట్లు తెలుస్తుంది.అలానే ఆమె తండ్రి కమల్ కాంత్ కూడా ఒక వ్యాపారవేత్త అన్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు అల్లు బాబీ పెళ్లి తతంగం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.







